లాక్ డౌన్ ముగిసినరెండు వారాలకు టెన్త్ పరీక్షలు..త్వరలోనే షెడ్యూల్
Sakshi Education
సాక్షి, అమరావతి: లాక్ డౌన్ ముగిసిన రెండు వారాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
త్వరలోనే పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. భౌతిక దూరం పాటిస్తూ, విద్యార్థులు మాస్కులు ధరించి పరీక్షలు రాసేలా ప్రత్యేక చర్యలు చేపడతామని మంత్రి వివరించారు. ఏప్రిల్ 28న అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి రమేష్ పోఖ్రియాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మంత్రి సురేష్‌తో పాటు విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, ఆంగ్లవిద్య ప్రాజెక్ట్ స్పెషల్ సెక్రటరీ వెట్రిసెల్వి, కమిషనర్ చినవీరభద్రుడు పాల్గొన్నారు.
మంత్రి సురేష్ ఏమన్నారంటే...
మంత్రి సురేష్ ఏమన్నారంటే...
- సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సూచనలతో జగనన్న గోరుముద్దతో మధ్యాహ్న భోజనం మరింత పౌష్టికంగా పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్నాం
- 9, 10 తరగతుల పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నాం, దీనికి కేంద్రం నుంచి సహకారం అందించాలి. మరిన్ని కేజీబీవీ, మోడల్ స్కూళ్లను మంజూరు చేయాలి.
- పెండింగ్‌లోని సమగ్ర శిక్ష పథకం నిధులు రూ.606 కోట్లు విడుదల చేయాలి.
- విద్యార్థులకు రేడియో, టీవీల ద్వారా పాఠ్యాంశాలు బోధించాం.
Published date : 29 Apr 2020 05:28PM