Innovation Inspire Manak: ప్రతిభకు పదును.. సృజనకు దన్ను
నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, రాష్ట్ర సాంకేతిక మండలి సహకారంతో పాఠశాల విద్యార్థుల కోసం 2023–24 విద్యా సంవత్సరానికి ఇన్‌స్పైర్ అవార్డ్స్ మనాక్ పేరిటి పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన నామినేషన్‌న్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల నుంచి..
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు సైన్స్ ఉపాధ్యాయులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది. జిల్లావ్యాప్తంగా వెయ్యికి పైగా స్కూళ్లు ఉన్నాయి. వీటిలో ప్రతి పాఠశాల నుంచి 5 నామినేషన్లు తగ్గకుండా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లావ్యాప్తంగా 5 వేల నామినేషన్లు స్వీకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుల వివరాలను www.inr pireawardr.drt.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని పాఠశాల లాగిన్ ద్వారా నమోదు చేయాలి. ఇందుకు ఆగస్టు 31వ తేదీ వరకు గడువు ఉంది. సామాజిక సమస్యలకు పరిష్కారం సూచించే విధంగా విద్యార్థులు చక్కటి ఆలోచనతో డ్రాఫ్ట్ రూపంలో తీర్చిదిద్ది ఇన్‌స్పైర్ అవార్డు మనాక్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. విద్యార్థులు పంపించిన అంశాలను వారు పరిశీలించి మంచి ఆలోచనలతో కూడిన ప్రాజెక్టును ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికై న ప్రాజెక్టుకు రూ. 10 వేలు వారి బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. ఈ డబ్బులతో ఉపాధ్యాయుడి సహకరంతో విద్యార్థి ప్రాజెక్టును సిద్ధం చేసి జిల్లా ప్రదర్శనకు రావాల్సి ఉంటుంది.
Vocational Skill Centres in Schools: స్కూల్ కాంప్లెక్స్‌లు.. వృత్తి నైపుణ్య కేంద్రాలు
దరఖాస్తు ఎలా చేయాలంటే..
● తొలుత పాఠశాల స్థాయిలో ఐడియా కాంపిటీషన్ నిర్వహించాలి. స్థానిక సమస్యలను తీర్చేదిగాా ఆ ఆలోచన ఉండాలి.
● తరగతివారీగా ఉత్తమ ఆలోచననను ఎంపిక చేసి అందుకు అవసరమై ప్రాజెక్టు రూపొందించాలి.
● విద్యార్థి పేరు, తండ్రి పేరు, తరగతి, విద్యార్థి బ్యాంకు ఖాతా, ఆధార్‌కార్డు ఎంటర్ చేయాలి.
● ప్రాజెక్టు పేరు, శాస్త్ర, సాంకేతికతకు సంబంధించిన అంశాలు ఉండేలా చూసుకోవాలి.
● ప్రాజెక్టు ఎంపిక రెండు నెలల్లో పూర్తి చేసి జిల్లాస్థాయిలో ప్రకటిస్తారు. తర్వాత వాటిని రాష్ట్రస్థాయికి పంపిస్తారు.
● ఎంపికై న ప్రాజెక్టును ప్రయోగ నిమిత్తం బ్యాంకు ఖతాలో రూ. 10 వేలు జమచేస్తారు.