INSPIRE Manak Awards : ప్రతి పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులకు అవకాశం..ఇన్‌స్పైర్ మనక్ అవార్డులకు దరఖాస్తులు
ఈ ఏడాది 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇన్‌స్పైర్ మనక్ అవార్డులకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తమ విద్యాసంస్థల నుంచి ఐదుగురు విద్యార్థులను ఇన్‌స్పైర్ అవార్డుకు నామినేట్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని రోహిణి తెలిపారు. సెప్టెంబర్ 15లోపు నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Malayalam Actor Indrans Writes 7th Class Exam: 68 ఏళ్ల వయసులో.. 7వ తరగతి పరీక్షలు రాసిన ప్రముఖ నటుడు
➤ అర్హత: 10 నుంచి 15 ఏళ్ల వయసు కలిగిన ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
➤ ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయాలి. పాఠశాల అథారిటీని క్లిక్ చేసి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసి, పాఠశాల వివరాలను పొందుపర్చాలి. జిల్లా విద్యాశాఖ నుంచి ఆమోదం లభించిన తర్వాత ఈమెయిల్, యూజర్ ఐడీతో లింక్ రాగానే పాస్‌వర్డ్ నమోదు చేయాలి. దీని తర్వాత ప్రాజెక్ట్ నమూనాకు సంబంధించి పూర్తి వివరాలను పొందుపర్చాలి.
ముఖ్య సమాచారం
➤ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
➤ దరఖాస్తులకు చివరితేది: 15.09.2024.
➤ వెబ్‌సైట్: www.inspireawardsdst.gov.in
Tags
- Inspire Manak Awards
- Students
- Education News
- INSPIRE Awards
- INSPIRE Awards Manak
- INSPIRE Awards 2024
- Education Institutions
- govt education institutions
- Applications
- online applications
- InspireAward
- OnlineApplications
- sakshi education awards
- INSPIRE Award Scheme
- StudentAwards2024
- InspireManakAwards
- InspireAwards2024
- HyderabadSchools
- SchoolNominations
- NominationDeadline
- EducationalInstitutions
- studentawards
- September15
- Rohini