ఏపీలో పదో తరగతి విద్యార్ధులకు దూరదర్శన్ పాఠాలు ..!
Sakshi Education
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ కారణంగా పాఠశాలలు మూసివేసిన నేపథ్యంలో 10వ తరగతి విద్యార్ధులకు ప్రత్యేకంగా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇంటి వద్ద నుంచే విద్యార్ధులు పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విధంగా ఈ క్లాసులు ఉంటాయి. ఏపీ విద్యాశాఖ, సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల ఆధ్వర్యంలో దూరదర్శన్- సప్తగిరి ఛానల్ ద్వారా పాఠ్యాంశాల బోధన జరుగుతుంది. ఏఫ్రిల్ 8 నుంచి ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బోధన కార్యక్రమాలు ఉంటాయి. ఏవైనా అర్ధం కాని అంశాలు, అనుమానాల నివృత్తికి ఎంపిక చేసిన రోజుల్లో విద్యార్ధులు ఫోన్-ఇన్ ద్వారా నిపుణుల నుంచి నివృత్తి చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది.
Published date : 08 Apr 2020 03:09PM