Skip to main content

ఏపీ టెన్త్ పరీక్షలను వాయిదా వేశాం... తిరిగి ఎప్పుడు అనేది త్వరలోనే..

సాక్షి, అమరావతి: పది, ఇంటర్‌ పరీక్షల వాయిదా కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌)లో హైకోర్టు తదుపరి విచారణను జూన్‌ 30వ తేదీకి వాయిదా వేసింది.
పదవ తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్‌ కోర్టుకు నివేదించారు.

ఏపీ పదో తరగతి– 2021కి సంబంధించిన స్టడీమెటీరియల్, ప్రీవియస్‌ పేపర్స్, బిట్‌బ్యాంక్స్, ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్స్, మోడల్‌ పేపర్లు, ప్రిపరేషన్‌ గైడెన్స్, కెరీర్‌ గైడెన్స్‌... ఇతర తాజా అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.

తిరిగి ఎప్పుడు నిర్వహించేది ఇంకా నిర్ణయించలేదన్నారు. అందువల్ల ఈ వ్యాజ్యంపై జూలైలో విచారణ జరపాలని కోరారు. ఇందుకు పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎస్‌.ప్రణతి అభ్యంతరం చెప్పడంతో న్యాయమూర్తులు జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి, జస్టిస్‌ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం ఈ నెల 30కి వాయిదా వేసింది. పరీక్షలను వాయిదా వేయాలనే వ్యాజ్యం విచారణలో ఉండగానే ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా.. టెన్త్ పరీక్షలను వాయిదా వేస్తూ ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని చింతల సుమన్‌ ధర్మాసనం ముందుంచారు.

ఏపీ ఇంటర్మీడియట్‌– 2021కి సంబంధించిన స్టడీమెటీరియల్, ప్రీవియస్‌ పేపర్స్, బిట్‌బ్యాంక్స్, ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్స్, మోడల్‌ పేపర్లు, ప్రిపరేషన్‌ గైడెన్స్, కెరీర్‌ గైడెన్స్‌... ఇతర తాజా అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి.
Published date : 04 Jun 2021 04:02PM

Photo Stories