‘ఏకలవ్య’ క్రీడాపోటీలు ప్రారంభం
పాడేరు గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ కొండలరావు జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండురోజులు జరిగే ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 ఏకలవ్య పాఠశాలలకు చెందిన సుమారు 1,680 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు తెలిపారు. గిరిజన క్రీడా విభాగం కోఆర్డినేటర్ శ్యాంసుందర్ మాట్లాడుతూ కబడ్డీ, రన్నింగ్, ఖోఖో, వాలీబాల్, చెస్, ఆర్చరీ, సైక్లింగ్, క్రికెట్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ తదితర 22 క్రీడల్లో పోటీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రతిభ చూపిన 487 మందిని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. జాతీయ స్థాయిలో ఆడే క్రీడాకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా శిక్షణ ఇస్తాయన్నారు. డిసెంబర్ 15 నుంచి 22 వరకు నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్రా లయోలా కళాశాలల మైదానాల్లో జరిగే జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో వీరు పాల్గొంటారని చెప్పారు. సీఐ జి.డి.బాబు, అకడమిక్ మానిటరింగ్ అధికారి రఘునాథ్, ఎంఈవో భారతిరత్నం, అరకులోయ స్పోర్ట్స్ స్కూల్ ప్రిన్సిపాల్ మూర్తి, సర్పంచ్ దాసుబాబు తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
Guest Teacher Posts: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 118 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..