ITDA PO B Rahul: విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రట రీ శరత్ ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శులు అలుగు వర్షిణి, సీతామాలక్ష్మి, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి, విద్యాశాఖ డీడీ చందనతో కలిసి పాఠశాలలు, హాస్టళ్ల నిర్వహణపై హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా ఆగస్టు 16న సమీక్షించారు.
చదవండి: Telangana Anganwadi 11000 Posts Notification: గుడ్‌న్యూస్ అంగన్‌వాడీలో 11వేల ఉద్యోగాలు
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. పాఠశాలల్లో, వసతి గృహాల పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్ది, మెనూ అమలుపై దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థు లు జ్వరాల బారిప పడకుండా తరచూ వైద్యపరీక్షలు చేయించాలని తెలిపారు. అనంతరం భద్రాచలం ఐటీ డీఏ నుంచి పీఓ రాహుల్ మాట్లాడుతూ.. వైద్య, ఆరో గ్య శాఖ సిబ్బంది సహకారంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. గురుకులాల ఆర్‌సీఓ నాగార్జున్‌రావు, ఏటీడీఓ అశోక్‌కుమార్ పాల్గొన్నారు.