Tenth Class Public Exams 2024: ప్రశ్నాపత్నం లీక్ అయిందని ---తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు
● ప్రశ్నాపత్నం లీక్ అయిందని, పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చిందని కొందరు పనిగట్టుకుని చేసే ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకుండా, విద్యార్థులు పరీక్షలకు ప్రశాంతంగా హాజరు కావాలి. ఒక వేళ ఏదైనా సెంటర్ నుంచి ప్రశ్నాపత్రం లీకేజీకి గురైతే అది ఎక్కడ జరిగిందో గుర్తించే విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.
● పరీక్ష కేంద్రంలో పక్క,పక్కన కూర్చునే ఏ ఇద్దరు విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నాపత్రంలో ప్రశ్నలు ఒక వరుస క్రమంలో ఉండవు. అందువల్ల విద్యార్థులు పక్కవారి పేజీలను చూసి సమాధానాలు రాయలనే ఆలోచన వీడాలి. కాపీయింగ్‌కు పాల్పడినా, జేబుల్లో స్లిప్పులు పెట్టుకుని వచ్చినా, పరీక్ష కేంద్రంలో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. పరీక్ష రాసే సమయంలో ఏ విద్యార్థి వద్ద అయినా స్లిప్పులు కనిపిస్తే పరీక్షల నుంచి డీబార్ చేస్తారు.
● పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు తీసుకురావడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రభుత్వం డీఓలు, ఇన్విజిలేటర్లతో పాటు చీఫ్ సూపరింటెండెంట్ల వద్ద సైతం సెల్‌ఫోన్లు ఉండేందుకు అనుమతిలేదు. ఒక వేళ విద్యార్థులు ఎవరైనా తమ వెంట సెల్‌ఫోన్లు తెస్తే, వాటిని భద్రపర్చేందుకు పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు ఉండవు.