దూరవిద్య టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు గడువు ఫిబ్రవరి 26
Sakshi Education
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీవోఎస్ఎస్) ఆధ్వర్యంలో దూరవిద్య విధానంలో పదో తరగతి, ఇంటర్లో ప్రవేశం పొందేందుకు ఈ నెల 26ను గడువు తేదీగా నిర్దేశించారు.
ఈ తేదీలోపు అపరాధ రుసుంతో కలిపి ఫీజు చెల్లించవచ్చని గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌ఎస్ గంగాభవానీ మంగళవారం తెలిపారు. రిజిస్ట్రేషన్, అడ్మిషన్ ఫీజుకు అదనంగా పదో తరగతికి రూ.300, ఇంటర్‌కు రూ.500 అపరాధ రుసుం చెల్లించాలని సూచించారు. ఇంటర్‌నెట్, ఏపీ ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలన్నారు. టెన్త్‌లో ప్రవేశానికి గతేడాది ఆగస్టు 31కి 14 ఏళ్లు నిండిన వారు, ఇంటర్‌లో ప్రవేశానికి 15 ఏళ్లు కనీస వయసు ఉన్నవారు అర్హులన్నారు. అభ్యర్థులు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమాలను ఎంపిక చేసుకోవచ్చన్నారు.
Published date : 24 Feb 2021 04:38PM