5వ తరగతి విద్యార్థులు ఆప్షన్స్ మార్చుకునే అవకాశం
Sakshi Education
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఐదవ తరగతి ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు మే 11 నుంచి 14వ తేదీలోపు పాఠశాలల ప్రాధాన్యత క్రమాలు (ఆప్షన్స్) మార్చుకునేందుకు అవకాశం ఇచ్చారు.
ఈ మేరకు అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్.పావనమూర్తి మే 10ర ఒక ప్రకటన విడుదల చేశారు. 5వ తరగతి ప్రవేశ పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 24న విడుదలయ్యాయి. అర్హత సాధించిన విద్యార్థులు ఎవరైనా పాఠశాలల ప్రాధాన్యత క్రమాలను మార్చుకొనే ఉద్దేశం ఉంటే మే 14వ తేదీలోపు ఆప్షన్ పెట్టుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని https://apgpcet.apcfss.in వెబ్‌సైట్ ద్వారా వినియోగించుకోవచ్చన్నారు. మొదటి విడత ఎంపిక జాబితా ను మే 16న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎంపికైనవారు మే 20వ తేదీలోపు తమకు కేటాయించిన పాఠశాలల్లో సీటును నిర్ధారణ చేసుకోవాలని సూచించారు.
Published date : 11 May 2022 12:48PM