Collector M Harinarayanan: నిరుద్యోగులకు మెరుగైన సేవలు
ఆన్‌లైన్ ఎంప్లాయీమెంట్ ఎక్స్చేంజ్ వెబ్‌సైట్ పోర్టల్‌ను కలెక్టర్ తన బంగ్లాలో జిల్లా ఉపాధి అధికారి కేవీ రామాంజనేయులుతో కలిసి జనవరి 12న ప్రారంభించారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే లాగిన్ వివరాలు, తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబరు వెంటనే ఎస్‌ఎంఎస్ ద్వారా పంపిస్తారని, జిల్లా ఉపాధి అధికారి దరఖాస్తుదారుని అభ్యర్థనను ఆమోదించిన వెంటనే ఎస్‌ఎంఎస్ ద్వారా ఎంప్లాయీ మెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ తెలియజేయనున్నట్లు తెలిపారు.
చదవండి: DMHO Dr. S. Bhaskara Rao: పారదర్శకంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ
అభ్యర్థి తన ఎంప్లాయీమెంట్ కార్డును లాగిన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉంటుందని, జిల్లా ఉపాధి కార్యాలయంలో ఎంప్లాయీమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు తమ పాత ఎంప్లాయీమెంట్ కార్డు నంబర్‌తో వివరాలను సరిచూసుకుని కొత్త ఎంప్లాయీమెంట్ కార్డును పొందవచ్చని తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకు కార్యాలయ పనివేళల్లో సంప్రదించవచ్చని తెలిపారు.