Best results if studied with a plan: ప్రణాళికతో చదివితే ఉత్తమ ఫలితాలు
ఒంగోలు సిటీ: పదో తరగతి విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రణాళికబద్ధంగా సన్నద్ధమైతే ఉత్తమ ఫలితాలు సాధించవ్చని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక జెడ్పీ నూతన కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్, స్టేషనరీ పంపిణీ చేశారు. జెడ్పీ సాధారణ నిధులు రూ.17 లక్షలతో వరుసగా మూడో ఏడాది 2,125 మందికి ఆల్ ఇన్ వన్ మెటీరియల్, పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్సు, ఎగ్జామ్ ఫ్యాడ్, స్కెచ్ పెన్నులు పంపిణీ చేశారు.
Also Read : AP State 10th Class Mathematics Study Material
ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, పురపాలక శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, సీఈఓ జాలిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, అధికారులు, జెడ్పీ కార్యాలయ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.