Skip to main content

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 7 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫిబ్రవరి 3న వెల్లడించారు.
మొత్తం 7 పేపర్లుగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే మే 3వ తేది నుంచి 15 వరకు 1-9 తరగతులకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

జూలై నుంచి కొత్త విద్యా సంవత్సరం...
కోవిడ్-19 కారణంగా ఇప్పటివరకు మూతబడిన పాఠశాలలు ఫిబ్రవరి 1న తిరిగి ప్రారంభమయ్యాయని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్( ఏడు పేపర్లు) :
జూన్ 7(సోమవారం) : ఫస్ట్ లాంగ్వేజ్
జూన్ 8( మంగళవారం) : సెకండ్ లాంగ్వేజ్
జూన్ 9(బుధవారం) : ఇంగ్లీష్
జూన్ 10(గురువారం) : గణితం
జూన్ 11 (శుక్రవారం) : ఫిజికల్ సైన్స్‌
జూన్ 12 (శనివారం) : బయోలాజికల్ సైన్స్‌
జూన్ 14( సోమవారం) : సోషల్ స్టడీస్
జూన్ 15 ( మంగళవారం) : ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 ఓఎస్‌ఎస్‌సీ మేయిన్ లాంగ్వేజ్ (సంస్కృతం, అరబిక్, పర్షియన్)
జూన్ 16 ( బుధవారం ): ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు(థియరీ)
Published date : 03 Feb 2021 05:11PM

Photo Stories