Skip to main content

ప్రైవేట్‌ స్కూళ్లలో పేదల పిల్లలకు ఇంత శాతం సీట్ల కేటాయింపు.. ప్రవేశాల షెడ్యూల్‌ ఇలా..

పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రైవేట్, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 25 శాతం సీట్లలో ప్రవేశాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేయనుంది.
Allotment of 25 percent seats for poor children in private schools
ప్రైవేట్‌ స్కూళ్లలో పేదల పిల్లలకు ఇంత శాతం సీట్ల కేటాయింపు.. ప్రవేశాల షెడ్యూల్‌ ఇలా..

ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి 25 శాతం సీట్లను పేద వర్గాల పిల్లలతో భర్తీ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, అనాధ, దివ్యాంగ, హెచ్‌ఐవీ బాధిత పిల్లలకు రిజర్వేషన్ల వారీగా సీట్ల కేటాయింపు చేపడతారు. ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీ మైనారిటీ, ఓసీలకు 6 శాతం, అనాథ, దివ్యాంగ, హెచ్‌ఐవీ బాధిత పిల్లలకు 5 శాతం సీట్లు కేటాయించనున్నారు. ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షికాదాయం రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.40 లక్షలు ప్రాతిపదికగా నిర్ణయించారు. ఉచిత నిర్బంధ విద్యకు సంబంధించి బాలల హక్కుల చట్టం–2009 జీవో 20ని సవరిస్తూ జీవో 129లో సవివర మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాల కోసం రెండో జాబితా విడుదల చేయనున్నారు.

చదవండి: ప్రాథమిక దశలోనే అత్యుత్తమ విద్యాబోధన.. ఉచితంగా బైజూస్ కంటెంట్..

16 నుంచి దరఖాస్తు ప్రక్రియ

2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రైవేట్, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లలో పేద విద్యార్థులకు ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ఈనెల 16వ తేదీనుంచి ప్రారంభం అవుతుందని కమిషనర్‌ తెలిపారు. ఆగస్టు 26వ తేదీ వరకు జ్టి్టp://ఛిట్ఛ.్చp.జౌఠి.జీn వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 1వ తరగతిలో ప్రవేశాలు, జీవో సవరణ వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వివరించారు.

చదవండి: ‘ఐఐటీ మద్రాస్‌’బీఎస్సీ డిగ్రీలో కొత్త సబ్జెక్టులు

ప్రవేశాల షెడ్యూల్‌ ఇలా

ప్రవేశాల నోటిఫికేషన్: ఆగస్టు 10
ఆన్లైన్ పోర్టల్లో అందుబాటులో: ఆగస్టు 16
దరఖాస్తుల సమర్పణ: ఆగస్టు 16 నుంచి 26 వరకు
లాటరీ పద్ధతిలో ఎంపిక: ఆగస్టు 30
మొదటి జాబితా విడుదల: సెప్టెంబర్ 2
విద్యార్థులకు ప్రవేశాలు: సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు

Published date : 05 Aug 2022 04:47PM

Photo Stories