Skip to main content

Tenth Class Public Exams 2024: పదోతరగతి ఫలితాల్లో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ....

పదోతరగతి ఫలితాల్లో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ....
పదోతరగతి ఫలితాల్లో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ....
పదోతరగతి ఫలితాల్లో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ....

కడప ఎడ్యుకేషన్‌: పదోతరగతి ఫలితాల్లో వైఎస్సార్‌ కడపజిల్లాను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించిందని జిల్లా విద్యాశాఖాధికారి మర్రెడ్డి అనూరాధ పేర్కొన్నారు.గత సంవత్సరం నాలుగోస్థానంలో ఉన్న జిల్లాను ఈ ఏడాది మొదటి, రెండో స్థానాల్లో నిలిపేలా కృషిచేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళుతున్నామని ఆమె పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా నూతన జిల్లా విద్యాశాఖాధికారిగా నియమితులైన ఆమె పలు విషయాలను వెల్లడించారు.

 జిల్లాలో ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలను ఎంతమంది విద్యార్థులు రాస్తున్నారు.

● జిల్లావ్యాప్తంగా 581 ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలల నుంచి 27,858 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలను రాస్తున్నారు. ఇందులో 14,269 మంది బాలురు, 13,589 మంది బాలికలు ఉన్నారు.

 ఎన్ని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు ఏంటి

● ఈనెల 18 నుంచి జిల్లా వ్యాప్తంగా 153 పరీక్షా కేంద్రాల్లో పదోతరగతి పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టాం. ఇందుకోసం ఇప్పటికే పలుమార్లు అధికారులతో సమావేశం నిర్వహించి, నిర్వహణపై సూచనలు, సలహాలను ఇచ్చాం.

 ఎలాంటి ఫలితాలను అంచానా వేస్తున్నారు

● పదోతరగతి ఫలితాల్లో వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకు చక్కటి రికార్డు ఉంది. గతంలో పలుమార్లు రాష్ట్రంలోనే నంబర్‌ 1 స్థానంలో నిలిచింది. గతేడాది నాలుగో స్థానంలో నిలవగా, ఈ సంవత్సరం కనీసం మొదటి, రెండో స్థానాల్లో ఉండేలా శ్రమిస్తున్నాం.

పది పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలపై  ఎలాంటి చర్యలు చేపట్టారు

● ఇప్పటికే పరీక్ష కేంద్రాలను గుర్తించి, వాటిల్లో అన్ని సౌకర్యాలు ఉండేలా చూస్తున్నాం. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా, మాస్‌కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

గ్రామీణ ప్రాంత విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?

● ఇందుకోసం అధికారులు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు. పరీక్ష రాసే విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ చూపించి బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

 జిల్లాలో ఎన్ని సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు

● జిల్లావ్యాప్తంగా ఆరు పరీక్ష కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. ఇందులో ఖాజీపేట బాలికల జిల్లా పరిషత్తు హైస్కూల్‌, కాశినాయన మండంలంలో ఏపీమోడల్‌ స్కూల్‌, నందిమండలం జిల్లా పరిషత్తు హైస్కూల్‌, చక్రాయపేట కేజీబీవీ, కలససాడు జిల్లా పరిషత్తు హైస్కూల్‌, కొండాపురం ఏపీఎస్‌డబ్లుఆర్‌ఎస్‌ ఉన్నాయి. వీటన్నింటిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం.

 పరీక్షల విధుల్లో ఎంతమంది స్క్వాడ్‌ బృందాలు, ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు

● జిల్లా వ్యాప్తంగా 153 పరీక్ష కేంద్రాల్లో 12161 మంది ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా బాధ్యతలు నిర్వహించనున్నారు. వీరితో పాటు 153 మంది చీఫ్‌ సూపరింటెండెట్లు, 153 మంది డిపార్టుమెంట్‌ ఆఫీసర్లు నియమించాం. వీరితోపాటు సిట్టింగ్‌ స్క్వాడ్‌, ఫ్‌లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, ప రీక్షల అబ్జర్వర్లు పరీక్షలను తనిఖీ చేయనున్నారు.

పదోతరగతి విద్యార్థులకు సంబంధించిన పరీక్ష సామగ్రి పరిస్థితి ఏంటి

● పదోతరగతికి సంబంధించిన పరీక్ష సామగ్రిని మండలాల వారీగా ఆయా కేంద్రాలకు చేరవేశాం. దీంతోపాటు ప్రశ్న సెట్‌–1 ఈ నెల 7వ తేదీన వచ్చాయి. సెట్‌–2 కూడా వస్తాయి. వీటన్నింటి కూడా భద్రత ఏర్పాట్ల మధ్య ఆయా పోలీసు స్టేషన్లకు చేరుస్తాం. అక్కడి నుంచి పరీక్ష కేంద్రాలకు చేరవేస్తాం.

పదోతరగతి ఫలితాల మెరుగుకు  ఎలాంటి చర్యలు చేపట్టారు

ప్రతిరోజూ విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణతో పాటు, సిలబస్‌ సకాలంలో పూర్తి చేయడం, ప్రీఫైనల్‌ పరీక్షల ఫలితాల ఆధారంగా పాఠశాల విద్యార్థుల స్థాయిని అంచనావేసి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించేలా మార్గనిర్దేశం చేశాం. విద్యార్థులు ఎలా చదువుతున్నారో నిత్యం వారి తల్లిదండ్రుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ వారి ఉపాధ్యాయుల ద్వారా తీసుకుంటున్నాం.

Published date : 09 Mar 2024 03:52PM

Photo Stories