Army College: ఆర్మీ కాలేజీలో ప్రవేశాల కి చివరి తేదీ ఇదే..
ప్రవేశానికి వయోపరిమితి: రిమ్స్‌లో 8వ తరగతిలోకి ప్రవేశాలు కోరుకొనే విద్యార్థినులు 2022 జూలై 1 నాటికి 13 ఏళ్లు దాటి ఉండరాదు. వారు 2009 జూలై 2న లేదా అంతకు ముందు జన్మించి ఉండాలి.
విద్యార్హతలు: 7వ తరగతి చదువుతుండడం, లేదా 2022 జూలై 1 నాటికి పాసై ఉండాలి.
పరీక్ష విధానం: ఈ విద్యార్థినులకు మేథమెటిక్స్, జనరల్ నాలెడ్జి, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో డిసెంబర్ 18న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి పేపర్లో కనీసం 50 శాతం మార్కులను సాధించాల్సి ఉంటుంది.
ముఖాముఖి: ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి ముఖాముఖి నిర్వహిస్తారు. 2022 మార్చిలో నిర్వహించే ఈ ముఖాముఖి తేదీని అభ్యర్ధులకు వేరేగా తెలియచేస్తారు.
వైద్యపరీక్షలు: ముఖాముఖిలో ఎంపికైన వారికి మిలటరీ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. రిమ్స్లో ప్రవేశానికి ఎంపికైన వారి వివరాలను అధికారిక వెబ్సైట్లో పొందుపరుస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి ఉన్న విద్యార్థినులు ప్రాస్పెక్ట్, దరఖాస్తు ఫారాల కోసం జనరల్ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.555 'www.rimc.gov.in' ద్వారా చెల్లించి పొందవచ్చు. అలా పొందిన దరఖాస్తు ఫారాలను నింపి ధ్రువపత్రాల జిరాక్సు పత్రాలను, పాస్పోర్టు సైజు ఫొటోలను జతచేసి నవంబర్ 15లోగా ‘అసిస్టెంట్ సెక్రటరీ (పరీక్షలు), ఏపీపీఎస్సీ, న్యూ హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ బిల్డింగ్, ఆర్టీఏ ఆఫీసు దగ్గర, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఎదురుగా, ఎంజీ రోడ్డు, విజయవాడ, ఆంధ్రప్రదేశ్–520010’ చిరునామాకు పంపాలని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు అక్టోబర్ 20న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.