పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం
ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా వివిధ స్థాయిల్లో ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటారు. రాజకీయ పార్టీల ద్వారానే ఎన్నికల ప్రక్రియ, ప్రాతినిధ్యం, ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యమవుతుంది. అయితే ఒక రాజకీయ పార్టీ తరఫున ఎన్నికైన సభ్యులు అధికారం కోసం తరచుగా మరో పార్టీలోకి మారుతున్నారు. విలువలకు తిలోదకాలిచ్చి అవకాశ వాదంతో పార్టీలను ఫిరాయించడం వల్ల రాజకీయ అస్థిరత్వం ఏర్పడటంతో పాటు ప్రజాభిప్రాయానికి భంగం వాటిల్లుతోంది. నానాటికీ జఠిలమవుతున్న ఈ సమస్యను అరికట్టడానికి నిబంధనలను కఠినతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పార్టీ ఫిరాయింపులను నివారించడానికి కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో అనేక ప్రయత్నాలు జరిగాయి. తొలిసారిగా పశ్చిమబెంగాల్ రాష్ట్రం 1979లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రూపొందించింది. 1985లో రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నపుడు 52వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రంలో మొదటిసారిగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రూపొందించారు. దీనికి సంబంధించి రాజ్యాంగంలో 10వ షెడ్యూల్‌ను చేర్చారు. దీన్నే ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం’ అంటారు. రాజ్యాంగంలోని 102 (2), 191 (2) ప్రకరణలు పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభ్యుల అనర్హతకు సంబంధించినవి. ప్రకరణ 101, 102(2), 190, 191(2) పార్లమెంటు, రాష్ట్ర శాసన సభల్లో ఖాళీలు, అనర్హతకు సంబంధించిన వివరాలను తెలియజేస్తాయి.
2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్‌లోని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి మరికొన్ని సవరణలు చేశారు.
అనర్హత- కారణాలు:
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభ్యులు కింది సందర్భాల్లో అనర్హతకు గురవుతారు.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పైన పేర్కొన్న అనర్హతలు కొన్ని సందర్భాల్లో వర్తించవు. అవి:
ఎ) ఒక రాజకీయ పార్టీ మొత్తం శాసనసభ్యుల్లో 2/3వ వంతు మంది మరో రాజకీయ పార్టీలో చేరినా లేదా స్వతంత్రంగా వేరొక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నా.. వారికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని అనర్హతలు వర్తించవు.
బి) లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, రాష్ట్ర విధానసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విధాన పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్లు తమ పదవికి రాజీనామా చేసినా లేదా పదవీకాలం ముగిసిన తర్వాత వేరొక రాజకీయ పార్టీలోకి చేరినా వారి శాసన సభ్యత్వం రద్దు కాదు.
సభ్యత్వాన్ని రద్దుచేసే అధికారం:
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్ట ప్రాతిపదికన శాసన సభ్యుల సభ్యత్వాన్ని రద్దుచేసే అధికారం సభాధ్యక్షులకు ఉంటుంది. సంబంధిత పార్టీ అధ్యక్షుడి ఫిర్యాదు మేరకు సభాధ్యక్షులు సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. సభాధ్యక్షులదే తుది నిర్ణయం.
ఈ నిర్ణయాన్ని ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు. కానీ 1993లో కిహోటో హోలాహన్ గట జాచీల్హు కేసులో సుప్రీంకోర్టు ఈ సెక్షన్‌ను కొట్టివేసింది. సభాధ్యక్షులదే తుది నిర్ణయం కాదనీ, అది న్యాయసమీక్షకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు నిర్ణయమే తుది నిర్ణయం అని తీర్పు చెప్పింది.
ప్రయోజనాలు:
2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో కొన్ని మార్పులు ప్రవేశపెట్టారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో మంత్రిమండలితో పాటు సభ్యుల అనర్హతలకు సంబంధించి కొన్ని మార్పులు చేశారు.

- ఒక పార్టీ తరఫున టికెట్ పొంది ఎంపికైన శాసనసభ్యుడు ఆ పార్టీకి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు.
- పార్టీ జారీ చేసిన విప్‌కు వ్యతిరేకంగా సభ్యులు గైర్హాజరైనా, అదేవిధంగా పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసినా సభ్యత్వాన్ని కోల్పోతారు.
- స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికైన శాసనసభ్యులు ఏదైనా పార్టీలో చేరితే వారి సభ్యత్వం రద్దవుతుంది.
- పార్లమెంటు/ రాష్ట్ర శాసన సభలకు నామి నేటైన సభ్యులు ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే వారి సభ్యత్వం రద్దవుతుంది. నామినేటెడ్ సభ్యులు.. నామినేటైన రోజు నుంచి ఆరు నెలల్లోపు ఏదైనా రాజకీయ పార్టీలో చేరితే వారి సభ్యత్వం రద్దు కాదు.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం పైన పేర్కొన్న అనర్హతలు కొన్ని సందర్భాల్లో వర్తించవు. అవి:
ఎ) ఒక రాజకీయ పార్టీ మొత్తం శాసనసభ్యుల్లో 2/3వ వంతు మంది మరో రాజకీయ పార్టీలో చేరినా లేదా స్వతంత్రంగా వేరొక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్నా.. వారికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని అనర్హతలు వర్తించవు.
బి) లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, రాష్ట్ర విధానసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, విధాన పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్లు తమ పదవికి రాజీనామా చేసినా లేదా పదవీకాలం ముగిసిన తర్వాత వేరొక రాజకీయ పార్టీలోకి చేరినా వారి శాసన సభ్యత్వం రద్దు కాదు.
సభ్యత్వాన్ని రద్దుచేసే అధికారం:
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్ట ప్రాతిపదికన శాసన సభ్యుల సభ్యత్వాన్ని రద్దుచేసే అధికారం సభాధ్యక్షులకు ఉంటుంది. సంబంధిత పార్టీ అధ్యక్షుడి ఫిర్యాదు మేరకు సభాధ్యక్షులు సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. సభాధ్యక్షులదే తుది నిర్ణయం.
ఈ నిర్ణయాన్ని ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు. కానీ 1993లో కిహోటో హోలాహన్ గట జాచీల్హు కేసులో సుప్రీంకోర్టు ఈ సెక్షన్‌ను కొట్టివేసింది. సభాధ్యక్షులదే తుది నిర్ణయం కాదనీ, అది న్యాయసమీక్షకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు నిర్ణయమే తుది నిర్ణయం అని తీర్పు చెప్పింది.
ప్రయోజనాలు:
- రాజకీయ సుస్థిరత సాధించవచ్చు.
- అవకాశవాద, అధికారపూరిత రాజకీయాలను అరికట్టవచ్చు.
- రాజకీయ పార్టీల్లో అవినీతి, అనైతిక ప్రవర్తనలను నిరోధించవచ్చు.
- రాజకీయ పార్టీల గురించి రాజ్యాంగంలో మొదటిసారిగా ఈ చట్టం ద్వారానే ప్రస్తా వించారు.
2003లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో కొన్ని మార్పులు ప్రవేశపెట్టారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో మంత్రిమండలితో పాటు సభ్యుల అనర్హతలకు సంబంధించి కొన్ని మార్పులు చేశారు.
- కేంద్రంలో ప్రధానమంత్రి సహా కేంద్ర మంత్రిమండలి సంఖ్య లోక్‌సభలోని మొత్తం సభ్యుల్లో 15 శాతానికి మించరాదు.
- రాష్ట్రాలకు కూడా ఇదే విధానం వర్తిస్తుంది. అయితే రాష్ట్రాల విషయంలో మంత్రి మండలి సంఖ్య 12కు తగ్గకూడదు.
- పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హులుగా ప్రకటించిన పార్లమెంటు లేదా శాసనసభ్యులు మంత్రులుగా నియమించడానికి అనర్హులు.
- పార్టీ ఫిరాయింపు చట్టం కింద అనర్హుడిగా ప్రకటించిన పార్లమెంటు/ రాష్ట్ర శాసన సభ్యులు ఆదాయ, లాభదాయక పదవుల్లో నియమించడానికి అనర్హులు.
- పదో షెడ్యూల్‌లో పార్టీ ఫిరాయింపు అనర్హతలకు మినహాయింపుగా పేర్కొన్న చీలిక (Split) అనే పదాన్ని తొలగించారు. ఈ సవరణ కంటే ముందు ఒక రాజకీయ పార్టీలో 1/3 వంతు సభ్యులు చీలిక ద్వారా బయటకి వచ్చి స్వతంత్రంగా ఉంటే వారి సభ్యత్వం రద్దయ్యేది కాదు. ప్రస్తుతం ఈ మినహాయింపును తొలగించారు.
పార్టీ ఫిరాయింపుల చట్టం - సుప్రీంకోర్టు తీర్పులు
కిహోటో హోలాహన్ Vs జాచీల్హు కేసు (1993)
సభ్యుల అనర్హతకు సంబంధించి సుప్రీం కోర్టుదే అంతిమ నిర్ణయం. పార్టీ ఫిరాయింపుల అనర్హత విషయంలో సభాధ్యక్షులు ఇచ్చిన రూలింగ్‌ను సుప్రీంకోర్టులో సవాలు చేయవచ్చు. కాబట్టి వారి నిర్ణయం సుప్రీంకోర్టు న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని స్పష్టీకరించారు. సభాధ్యక్షులు తీర్పులు కోర్టు తరహాలో (ట్రైబ్యునల్స్) ఉంటాయి
. అందువల్ల వారి నిర్ణయాన్ని న్యాయస్థానంలో ప్రశ్నించడం రాజ్యాంగ బద్ధమేనని పేర్కొంది.
జి. విశ్వనాథన్ Vs తమిళనాడు స్పీకర్ (1996):
ఒక శాసనసభ్యుడుని ఒక పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత వేరొక రాజకీయ పార్టీలో చేరితే అతడు పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదలుకున్నట్లుగా భావించవచ్చు. కాబట్టి అతడి సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చు.
రాజేంద్రసింగ్ Vs స్వామి ప్రసాద్ కేన్ (2007)
సభాధ్యక్షుల నిర్ణయాన్ని న్యాయస్థానాలు ఏయే పరిస్థితుల్లో సమీక్షించవచ్చు అనే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా ఫిర్యాదుపై సభాధ్యక్షులు తగిన నిర్ణయాన్ని తీసుకోనప్పుడు, ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా పార్టీ విలీనాలను అంగీకరించినప్పుడు, పదో షెడ్యూల్‌లో నిర్ణయించిన పద్ధతి ప్రకారం చర్యలు తీసుకోవడంలో విఫలమైన సందర్భాల్లో న్యాయస్థానంలో వారి చర్యలను ప్రశ్నించ వచ్చని పేర్కొంది.

#Tags