Success Journey of IAS Officer: నేను ఎటువంటి కోచింగ్ లేకుండానే.. నాలుగు నెలల్లో సివిల్స్ కొట్టానిలా.. కానీ ఆ టైమ్‌లో నా పరిస్థితి..
కొందరు ఒక్క ప్రయత్నానికే అనుకున్న దారిలో విజయవంతులవుతారు. మరికొందరు పలు ప్రయత్నాలలో దక్కించుకుంటారు. అలా, ఇక్కడ ఢిల్లీ అమ్మాయి తన తెలివితో మొదటి ప్రయత్నంలోనే అనుకున్న గమ్యానికి చేరుకుంది. తనే సౌమ్యా శర్మ.. ఈ యువతి, ఢిల్లీకి చెందింది.
తన చదువులో చాలా తెలివైనది. చిన్నతనం నుంచి చురుగ్గా పెరిగింది. కాని, తనకి ఉన్న ఒకే ఒక్క లోపం తన చెవులు కేవలం 5 నుంచి 10 శాతం మాత్రమే వినిపిస్తాయి. అయినప్పట్టికీ, ఎన్నడూ ఇబ్బంది పడలేదు.. తన గమ్యానికి చేరే మార్గాలనే వెతికేది. అటువంటి యువతి సాధించిన గొప్ప విజయాల గురించి తెలుసుకుంటే మనకూ ఒక స్పూర్తి లభిస్తుంది.
అసలు ఎవరీ సౌమ్య శర్మ..
సౌమ్య శర్మ ఢిల్లీకి చెందిన యువతి. తన తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే. అయితే, తనకీ డాక్టర్ కావాలనే కోరిక ఉండేది.. కాని, మళ్ళీ తన కోరికను మళుకొని లాయర్ కావాలని ఆశ పడింది. అందుకు తన తల్లిదండ్రులు కూడా తనకు సహకరించారు. ఇక తన చదువును ప్రారంభించి పూర్తి అయ్యే సమయంలో తనకు యూపీఎస్సీ పరీక్ష రాయాలనే ఆలోచన వచ్చింది. ఈ నేపథ్యంలోనే తను చదువుతున్న ఎల్ఎల్బీ తరువాత యూపీఎస్సీలో సివిల్స్ రాయాలని సిద్ధపడింది. అందుకు తను కేవలం ఆరు నెలల సమయం మాత్రమే తీసుకుంది. ఈ ఆరు నెలల్లో తను ప్రిపేర్ అయ్యి, పరీక్షకు సిద్ధమైంది.
చదువు..
సౌమ్యకు తన 16 ఏళ్ళ వయసులో వినికిడి శక్తిని 90 శాతం కోల్పోయింది. తను చిన్నప్పటి నుంచి ఎంతో చురుగ్గా, తెలివిగా ఉండేది. ఇప్పటికీ అలాగే ఉంటుంది. చదువు విషయంలో ఎంతో శ్రద్ధగా ఉంటుంది. తన పదో తరగతిలో టాపర్‌గా నిలిచింది. తనకి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఓటమిని ఒప్పుకోదు.
Women Success Story in Civils: జిల్లా స్థాయిలో యువతి.. సివిల్స్‌లో సాధించాలన్న ఆశయంతోనే..
పరీక్షకు ముందు..
ఈ పరీక్ష రాసే సమయంలో కూడా తన ఆరోగ్యం తనకు సహకరించలేదు. చదివినంత కాలం తనకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదు కాని, పరీక్ష రాసే ముందు తనకు చాలా తీవ్రమైన జ్వరంతో బాధ పడింది. ఇటువంటి సమయంలో తను తన పనులను కూడా సక్రమంగా చేసుకోలేపోయేది.
తన బెడ్ పైనుంచి కూడా లేవలేనిస్థితిలో ఉండేది. అయినప్పట్టికి, తను పరీక్షను సక్రమంగానే రాసింది. ఈ పరీక్ష కోసం తను ఎటువంటి శిక్షణ తీసుకోలేదు. ఎవరి సాయం కోరలేదు. తనకు తానుగానే సిద్ధపడి శ్రమించి చదివింది. యూపీఎస్సీ పరీక్ష రాసే సమయంలో తన వయసు కేవలం 23 సంవత్సరాలే. పరీక్షలో తనకు దేశంలోనే 7వ ర్యాంకు రావడం ఎంతో గొప్ప విశేషం.
Civils Achievement: సివిల్స్‌లో సాధించిన ఇద్దరు యువకులు.. ఇదే వారి ప్రయాణం
సౌమ్య శర్మ సాధించిన గొప్ప విజయాలు గురించి తన మాటల్లో..
నేను నా ఎల్ఎల్బీని ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీలో పూర్తి చేశాను. నాకు మా అమ్మానాన్నల లాగే డాక్టర్ అవ్వాలనే ఆశ ఉండేది. కాని, దారి మళుకొని ‘లా’ చదివాను. నా చదువు పూర్తయ్యే సమయంలో నాకు యూపీఎస్సీ పరీక్ష రాయాలనే ఆలోచన వచ్చింది. అందుకే, యూపీఎస్సీ పరీక్ష కోసం సనద్ధమవడం ప్రారంభించాను. ఇందుకు నా తల్లిదండ్రులు కూడా నాకు సహకరించారు. నేను దీని కోసం నాలుగు నెలల పాటు కష్టపడి చదివాను.
ఈ ప్రయాణం ఏమీ కొత్తగా అనుకోలేదు. ఇది కూడా నేను రాసే మామూలు పరీక్షలే అని భావించాను. నా దృష్టిలో ఎటువంటి పరీక్షకైనా పట్టుదల, కష్టం, సరైన ప్రణాళికతోపాటు ఒక మంచి వ్యూహం ఉండాలని నమ్ముతాను దాన్నే పాటించాను.
Civils Top Rankers: సివిల్స్‌లో ర‍్యాంకు సాధించి ప్రధాని ప్రశంసలు అందుకున్న విద్యార్థులు వీరే..