UPSC Civil Services Exam 2024: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపిక విధానం ఇలా...

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ తదితర 21 ఉన్నత స్థాయి సర్వీసుల్లో పోస్టుల భర్తీకి సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 1056
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్యలో ఉత్తీర్ణత ఉండాలి. అర్హత కోర్సు ఫైనల్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: అభ్యర్థుల వయసు 2024 ఆగస్టు 1వ తేదీ నాటికి 21-32 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 

ఎంపిక విధానం: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 2024, మార్చి 5
  • ప్రిలిమినరీ పరీక్ష తేది: 2024, మే 26
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/, https://upsconline.nic.in/

చదవండి: UPSC Civil Service 2024 Notification: సివిల్స్‌ నోటిఫికేషన్ విడద‌ల‌.. ప్రిలిమ్స్‌లో రాణించేందుకు నిపుణులు మెలకువలు...

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags