BSc Admissions : హైద‌రాబాద్ నిమ్స్‌లో బీఎస్సీ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు.. సీట్ల వివ‌రాలు..

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌).. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ (అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌) కోర్సులో ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం సీట్ల సంఖ్య: 100.
కోర్సులు, సీట్లు వివరాలు
»    బీఎస్సీ(అనెస్తీషియా టెక్నాలజీ)–10 సీట్లు; బీఎస్సీ(డయాలసిస్‌ థెరపీ టెక్నాలజీ)–20 సీట్లు; బీఎస్సీ(కార్డియోవాస్కులర్‌ టెక్నాలజీ)–12 సీట్లు; బీఎస్సీ(ఎమర్జెన్సీ అండ్‌ ట్రామా కేర్‌ టెక్నాలజీ)–08 సీట్లు; బీఎస్సీ(రేడియోగ్రఫీ అండ్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ)–10 సీట్లు; బీఎస్సీ(మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీ)–12 సీట్లు; బీఎస్సీ(న్యూరో టెక్నాలజీ)–06 సీట్లు; బీఎస్సీ(పెర్ఫ్యూజన్‌ టెక్నాలజీ)–04 సీట్లు; బీఎస్సీ(రేడియేషన్‌ థెరపీ టెక్నాలజీ)–04 సీట్లు; బీఎస్సీ(రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ)–10 సీట్లు; బీఎస్సీ(ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌)–04 సీట్లు.
»    కోర్సు వ్యవధి: నాలుగేళ్లు(ఇంటర్న్‌షిప్‌తో సహా).
»    అర్హత: ఇంటర్మీడియట్‌(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) లేదా బ్రిడ్జ్‌ కోర్సు ఇంటర్మీడియట్‌ (బయాలజీ, ఫిజికల్‌ సైన్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి. టీజీ ఈఏపీసెట్‌–2024లో తప్పనిసరిగా అర్హత సాధించి ఉండాలి.
»    వయసు: అభ్యర్థులకు 31.12.2024 నాటికి పదిహేడేళ్లు నిండి ఉండాలి.
»    ఎంపిక విధానం: టీజీ ఈఏపీసెట్‌–2024 ర్యాంక్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 09.08.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 23.08.2024.
»    దరఖాస్తు హార్డ్‌కాపీలకు చివరితేది: 27.08.2024.
»    ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా వెల్లడితేది:05.10.2024
»    తుది మెరిట్‌ జాబితా వెల్లడితేది: 10.10.2024.
»    వెబ్‌సైట్‌: https://www.nims.edu.in

BPT Course Admissions : నిమ్స్ బీపీటీ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు.. ఎంపిక విధానం ఇలా..

#Tags