AGRICET 2024 Admissions : బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీలో ప్రవేశాలకు అగ్రిసెట్–2024.. ఈ విద్యార్థులు మాత్రమే అర్హులు..
» కోర్సు వివరాలు: బీఎస్సీ(ఆనర్స్).
» అర్హత: అభ్యర్థులు ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీ/ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ అగ్రికల్చర్/సీడ్ టెక్నాలజీ/ఆర్గానిక్ ఫార్మింగ్‌లో రెండేళ్ల డిప్లొమాలో ఉత్తీర్ణులవ్వాలి.వయసు:31.12. 2024 నాటికి 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
» ఎంపిక విధానం: ఇంటర్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» పరీక్ష విధానం: ఆన్‌లైన్ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) విధానంలో జరుగుతుంది. మొత్తం 120 మార్కులకు 120 ప్రశ్నలు ఉంటాయి. çపరీక్ష మాధ్యమం ఇంగ్లిష్, తెలుగు భాషలలో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు. పరీక్ష కాలవ్యవధి 1 గంట 30 నిమిషాలు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది కన్వీనర్, అగ్రిసెట్–2024, ది అసోసియేట్ డీన్, ఎస్ వీ అగ్రికల్చరల్ కాలేజ్, తిరుపతి–517502, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.07.2024.
» ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 05.08.2024.
» హాల్‌టికెట్‌ల డౌన్‌లోడ్ తేదీ: 16.08.2024 నుంచి 23.08.2024 వరకు.
» పరీక్ష తేది: 27.08.2024.
» పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://angrau.ac.in
Admissions Notification 2024 : అగ్రిసెట్ అండ్ అగ్రి ఇంజనీరింగ్ సెట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల..