TSPSC : టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వ‌ద్ద ఉద్రిక్తత.. కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ కార్యాలయాన్ని ముట్టడించే ప్ర‌య‌త్నం ఉద్రిక్త వాతావరణం నెల‌కొంది. నిరుద్యోగ జేఏసీ ఆందోళన నేపథ్యంలో.. హైద‌రాబాద్‌ నగరంలో జూలై 5వ తేదీ (శుక్రవారం) ఉదయం ఉద్రిక్తకు దారితీసింది.

పలు డిమాండ్ల సాధనతో ఆందోళనకు దిగిన జేఏసీ కార్యకర్తలు.. టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించే యత్నం చేశారు. అయితే అప్పటికే నగరమంతా భారీగా మోహరించిన పోలీసులు.. ఎక్కడికక్కడే వాళ్లను అరెస్ట్‌ చేశారు. బీజేవైఎం, బీఆర్‌ఎస్పీ ఆధ్వర్యంలో నిరుద్యోగ జేఏసీ హైదరాబాద్‌లోని టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపు ఇచ్చింది. దీంతో నగర పోలీసులు అప్రమత్తం అయ్యారు. 

KTR Demands Job Calendar 2024 : ఏడు నెలలు పూరైంది.. ఇంకెప్పుడు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తారు..?

నగర శివారుల్లో, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు.. ఎక్కడికక్కడే చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు టీజీపీఎస్సీ కార్యాలయం వైపు దూసుకెళ్లే యత్నం చేసిన విద్యార్థి సంఘం నేతల్ని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. గ్రూప్‌ 2, 3 పోస్టుల సంఖ్య పెంపు, గ్రూప్‌1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తి పాటించాలి, జాబ్‌ క్యాలెండర్, జీవో 46 రద్దు వంటి డిమాండ్లతో నిరుద్యోగులు పోరుబాటపట్టారు. 

➤ Telangana Job Calendar 2024 : జాబ్ క్యాలెండర్ 2024 విడుద‌ల‌.. త్వ‌ర‌లోనే.. ఇంకా పోస్టుల సంఖ్య పెంపుకు..!

డిసెంబర్‌లో గ్రూప్-2 నిర్వహించాల్సిందే.. : నిరుద్యోగులు

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2, 3 పోస్టుల సంఖ్యను పెంచి, డిసెంబర్‌లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కోరుతున్నారు. DSC, గ్రూప్-2కి కేవలం ఒక్క రోజు గ్యాప్ మాత్రమే ఉందని గుర్తుచేస్తున్నారు. గ్రూప్-2, 3కి ఒకే సిలబస్ ఉన్నందున డిసెంబర్‌లో నిర్వహిస్తే నిరుద్యోగులు ఒత్తిడి లేకుండా సజావుగా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఈ విషయంలో సీఎం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

#Tags