TSPSC Exam Dates 2023 : టీఎస్‌పీఎస్సీ కీల‌క ప‌రీక్ష‌ల తేదీలు ప్ర‌క‌ట‌న‌.. ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) వివిధ ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను జ‌న‌వ‌రి 30వ తేదీన‌ (సోమ‌వారం) ప్ర‌క‌టించింది.
tspsc exam dates 2023

నేడు టీఎస్‌పీఎస్సీ బోర్డు స‌భ్యులు కీల‌క స‌మావేశం నిర్వ‌హించి.. ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు. వివిధ ఉద్యోగాల‌కు సంబంధించిన రాత‌ప‌రీక్ష‌ల తేదీల‌ను ప్ర‌క‌టించ‌డంతో పాటు.. గ్రూప్-4 ద‌ర‌ఖాస్తు గ‌డువును కూడా పెంచారు. నేడు ఐదు నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్ష తేదీలను నేడు ఖరారు చేశారు. 

ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే..?

1. పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల TSPSC నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 247 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 19 సబ్జెక్టులకు సంబంధించి 247 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీనిని ఓఎమ్ఆర్ బేస్డ్ విధానంలో నిర్వ‌హించ‌నున్నారు. 13 మే ఉదయం పేపర్-1, సాయంత్రం పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నట్లు TSPSC తెలిపింది.

2.అగ్రికల్చర్ ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తు గ‌డువును ఫిబ్రవరి 02, 2023 వరకు పొడిగించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 148 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 24న ఈ పరీక్షను నిర్వహించనన్నట్లు TSPSC తెలిపింది. దీనిని కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఉదయం పేపర్-1, సాయంత్రం పేపర్-2 పరీక్షను నిర్వహించనున్నారు.

3. డ్రగ్స్ కంట్రోట్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ కు సంబంధించి మొత్తం 18 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిని ఓఎమ్ఆర్ బేస్డ్ లేదా కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షను మే 07, 2023న ఉదయం పేపర్-1, సాయంత్రం పేపర్-2 పరీక్షను TSPSC నిర్వహించ‌నున్నారు.

4. తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ, పాలిటెక్నిక్ విభాగంలో 71 లైబ్రేరియన్  పోస్టులను భర్తీ చేయనున్నారు. మే 17, 2023న ఉదయం పేపర్- 1, సాయంత్రం పేపర్-2 పరీక్షను TSPSC నిర్వహించనున్నారు. 

5. ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టులకు సంబంధించి మొత్తం 128 ఉద్యోగాలను TSPSC భర్తీ చేయనున్నారు. దీనిని కూడా కంప్యూటర్ బేస్ట్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. మే 17, 2023న ఉదయం పేపర్-1, సాయంత్రం పేపర్ -2 పరీక్షను నిర్వహించ‌నున్నారు.

#Tags