Tejaswi FRO Success Story : సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. అడ‌వి బాట ప‌ట్టా.. ఎందుకంటే..?

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. ల‌క్ష‌ల జీతం. ఇంత అందమైన జీవితానికి ఇంకేమి కావాలి. కానీ.. ఇవేవీ ఈమెకు సంతృప్తిని ఇవ్వవని గ్రహించింది. ఈమె అడవితో స్నేహాన్ని కోరుకుంది.
Tejaswi, Forest Range Officer

అమాయక ప్రజల మధ్య జీవించాలని అనుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని కాదనుకుని అడవి మార్గం పట్టింది. ప్రస్తుతం అన్నీ తానై అడవికి ప్రాణం పోస్తున్నది. ఉన్న‌త‌మైన ఆలోచ‌న‌తో ముందుకు వెళ్లుతున్న‌ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ తేజస్వి స‌క్సెస్ స్టోరీ మీకోసం..

తొలి ప్రయత్నంలోనే..
మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి. హైదరాబాద్‌లో బీటెక్‌ చేశాను. ఐటీలో చాలా ఆఫర్లే వచ్చాయి. కానీ ఆ జీవితం వద్దనుకున్నా. ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగమే ఉత్తమ మార్గమనిపించింది. అందుకే.., హైదరాబాద్‌లో ఉంటూ గ్రూప్స్‌కి ప్రిపేర్‌ అయ్యాను. తొలి ప్రయత్నంలోనే ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌(ఎఫ్‌ఆర్‌ఓ) ఉద్యోగం వచ్చింది.

Success Story: నా కష్టం వృథా కాలేదు.. గ్రూప్‌-2 కొట్టానిలా..

Inspirational Stories: ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా.. ఇలా ఎంద‌రికో ఉన్న‌త కొలువులు..

మా అమ్మానాన్న సైతం.. 
ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్ ఉద్యోగంలో జాయిన్ కావ‌ద్ద‌ని  అంద‌రు వారించారు. ఫారెస్ట్‌ ఆఫీసర్‌ అంటే రాత్రీపగలూ తేడా లేకుండా దట్టమైన అడవుల్లో తిరగాల్సి ఉంటుందని భయపెట్టారు. అమ్మాయిలకు అటువంటి ఉద్యోగం అవసరమా? అంటూ నా మనోబలాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. కానీ, నేను మనసు మార్చుకోలేదు. అమ్మానాన్న సైతం నా అభిప్రాయానికే ఓటేశారు.

TSPSC Groups Success Tips: ఇలా చ‌దివా.. గ్రూప్‌–1లో స్టేట్ టాపర్‌గా నిలిచా..

అన్ని ఒక్కేచోటే.. కానీ..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటేనే పోడు సమస్యలు అధికం. గిరిజనులు ఎక్కువ. పక్కనే ఛత్తీస్‌గఢ్‌ ఉంది. నక్సల్స్‌ ప్రభావమూ ఎంతో కొంత ఉంటుంది. తొలుత ట్రైనింగ్‌కు భద్రాద్రి జిల్లాకే పంపారు. సవాళ్లతో కూడుకున్న ఉద్యోగమని ముందే తెలుసు. కానీ.. ఏడూళ్ల బయ్యారం వెళ్లాల్సి వస్తుందని అనుకోలేదు. మొదట్లో అంతా కొత్తగా అనిపించేది. కొద్దిరోజులకే ఆ వాతావరణం అలవాటైంది. ఇక్కడి ప్రజల మంచితనం, ఆదివాసీల అమాయకత్వం.. నాకెంతో నచ్చాయి. ట్రైనింగ్‌ తర్వాత, ఇక్కడే పోస్టింగ్‌ ఇచ్చారు.

Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!

కుటుంబ నేప‌థ్యం :
ఆకలితో ఉన్నవాళ్లకు ఓ ముద్ద అన్నం పెట్టడంలోని సంతృప్తి.. ఎన్నికోట్లు ఖర్చు పెట్టినా పొందలేమని అనేవారు అమ్మానాన్న. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, మనసుకు నచ్చిన పనే చెయ్యాలని చెప్పేవారు. ఇద్దరూ ఉపాధ్యాయులే. మేం ఇద్దరం సంతానం. నేను, చెల్లి. పాఠాలతోపాటు సమాజాన్ని కూడా చదివించారు మా కన్నవాళ్లు.

TSPSC& APPSC Groups: గ్రూప్స్‌లో గెలుపు బాట‌ కోసం.. ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల సూచ‌న‌లు- సలహాలు ..

Success Story: గ్రూప్-2లో విజయం సాధించా.. మళ్లీ గ్రూప్-2 రాశా.. ఎందుకంటే..?

మంచిగా చదువుకుంటే చాలు..
అడవిలో ఉద్యోగం అంటే మొక్కలను సంరక్షించమే కాదు, అక్కడి అమాయక ప్రజలనూ రక్షించాలి. అందుకే.. నాకు తోచిన సాయం చేస్తుంటా. ఆదివాసీ గూడాల్లో పిల్లలకు యూనిఫాం కుట్టించడం, కష్టాల్లో ఉన్నవాళ్లకు నిత్యావ సరాలు అందించడం.. నా బాధ్యతగా భావిస్తా. ఓసారి ఒక పాప నా దగ్గరికి వచ్చి.. ‘మేడం మీలా ఉండాలంటే ఏం చేయాలి?’ అని అడిగింది అమాయకంగా. మంచిగా చదువుకుంటే చాలని చెప్పాను.

Success Story: ఈ పరిస్థితులే.. న‌న్ను నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా చేశాయ్‌..

#Tags