SI Inspirational Success Story : ఈ బలమైన సంకల్పంతోనే.. ఎస్సై ఉద్యోగం కొట్టా.. ఎందుకంటే..?
అయినా పిల్లలకు పేదరికం అడ్డు రాకూడదనే లక్ష్యంతో వారి చదువుకు తల్లిదండ్రులు రాచ మార్గాన్ని పరిచారు. ఫలితంగా తల్లిదండ్రుల ఆశయాల నీడలో ముందుకు సాగిన గట్టు శృతి.. ఆగస్టు 6వ తేదీన (ఆదివారం)వెలువడిన ఎస్సై పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు.
☛ TS SI Selected Candidates Stories : ఒక్కో దశ దాటుతూ.. ఎస్ఐ ఉద్యోగం సాధించామిలా.. నేడు..
ఎడ్యుకేషన్ :
ఇటు తల్లిదండ్రుల ఆశయాలకు అటు పుట్టి పెరిగిన ప్రాంతానికి ఎల్లలెరుగని కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టారు. తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన గట్టు శృతి. మొదటి నుంచి చదువులో ప్రతిభకు పట్టంకడుతూ ముందుకు సాగేది. అందులో భాగంగానే 1వ తరగతి నుంచి పదవ తరగతి వరకు తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ,ఇంటర్మీడియట్ హనుమకొండలో చదివి ఉన్నతంగా రాణించింది. తర్వాత సంగారెడ్డిలోని జేఎన్టీయూలో బీటెక్ ఎలక్ట్రానిక్ ఈసీఈ కోర్సు చదివి.. తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకునేది.
☛ Success Stories : ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా.. చిన్న స్థాయి నుంచి..