TS Home Guard Jobs 2024 : సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. హోంగార్డు ఉద్యోగాల‌ను వెంట‌నే రిక్రూట్‌ చేయండిలా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో పోలీసు ఉద్యోగాల కొర‌త తీవ్రంగా ఉంది. వర్షాకాలం, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది కొరత ఉంటే హోంగార్డులను రిక్రూట్ చేసుకోవాలని ముఖ్య‌మంత్రి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

వర్షాకాలం సీజన్‌లో హైదరాబాద్‌, సికింద్రాబాద్ జంట నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. 

☛ Good News For 10th Pass Candidates : గుడ్‌న్యూస్‌.. ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌లోనే 50000 ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌.. త్వ‌ర‌లోనే..

ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఫిజికల్ పోలీసింగ్ విధానం అనుసరించాలని.. సిబ్బంది కొరత ఉంటే హోమ్ గార్డులను వెంటనే రిక్రూట్‌ చేసుకోవాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు యూనిట్‌గా తీసుకుని డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ను ఇంటిగ్రేట్ చేయాలలన్నారు. దీంతో పాటు గ‌తంలో హోంగార్డు ఉద్యోగాలు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లను కూడా ప‌రిష్కారించే అవ‌కాశం ఉంది.

#Tags