Balagam Movie Latest Update : తెలంగాణ కానిస్టేబుల్‌ ఫైన‌ల్ రాత‌ప‌రీక్ష‌లో 'బలగం' సినిమా నుంచి అడిగిన ప్ర‌శ్న ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఫైన‌ల్ రాత‌ప‌రీక్ష‌ను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ఏప్రిల్ 30వ తేదీన‌ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించించిన విష‌యం తెల్సిందే.
TS constable final exam bits 2023

16,321 కానిస్టేబుల్‌ పోస్టులకు ఈ భ‌ర్తీ ప్ర‌క్రియ నిర్వ‌హిస్తున్నారు. అయితే ఈ రాత‌ప‌రీక్ష‌లోని ఒక ప్ర‌శ్న‌ను ఇటీవ‌ల తెలంగాణ‌లో అత్యంత ఆదరణ పొందిన బ‌ల‌గం చిత్రానికి సంబంధించిన ఒక ప్ర‌శ్న‌ను ఇచ్చారు.

☛ TS Constable Final Exam Question Paper with Key 2023 : కానిస్టేబుల్‌ ఫైనల్‌ రాత పరీక్ష కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' ఇదే.. ఈసారి వ‌చ్చిన ప్ర‌శ్న‌లు ఇవే..

ఈ సినిమా ఒక రేంజ్‌లో..
బలగం సినిమానా? మజాకా? కానిస్టేబుల్‌ పరీక్షలో బలగం చిత్రానికి సంబంధించిన ప్రశ్న వచ్చిందంటే ఈ మూవీ ఏ రేంజ్‌లో ఆదరణ పొందిందో అర్థమవుతోంది. ఏప్రిల్ 30వ తేదీన‌ జరిగిన కానిస్టేబుల్‌ మెయిన్స్‌ పరీక్షలో బలగం సినిమాకు వచ్చిన అవార్డుపై ఓ ప్రశ్న అడిగారు. 

అడిగిన ప్ర‌శ్న ఇదే..
మార్చి 2023లో ఒనికో ఫిలింస్‌ అవార్డుల్లో ఏ విభాగంలో బలగం సినిమాకు పురస్కారం లభించింది?
1. ఉత్తమ డాక్యుమెంటరీ, 
2. ఉత్తమ నాటకం, 
3. ఉత్తమ దర్శకుడు, 
4. ఉత్తమ సంభాషణ 

స‌మాధానం : 2. ఉత్తమ నాటకం సరైన సమాధానం. 

ఈ సినిమా ఒక్క ఒనికో ఫిలిం అవార్డు మాత్రమే ఏంటి లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో బెస్ట్‌ ఫీచర్‌ ఫిలిం, బెస్ట్‌ సినిమాటోగ్రఫీ అవార్డులు సైతం సొంతం చేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలోనూ ఎన్నో అవార్డులు అందుకుని సత్తా చాటింది.

నాకు చాలా గర్వంగా ఉంది..

తాజాగా కానిస్టేబుల్‌ పరీక్షలో బలగంపై ప్రశ్న రావడంపై దర్శకుడు వేణు సంతోషం వ్యక్తం చేశాడు. ట్విటర్‌ వేదికగా ఆయన స్పందిస్తూ.. 'నిన్న నా స్నేహితుడొకరు ఈ ఫోటో పంపారు. చాలా సంతోషంగా, గర్వంగా అనిపిస్తోంది. నా కలను నిజం చేసిన తెలుగు ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అంటూ చేతులెత్తి నమస్కరించిన ఎమోజీలను జత చేశాడు.

➤☛ TS SI General Studies Question Paper With Key 2023 : TS SI Final Exam General Studies Question Paper ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..

➤☛ TS SI Final Exam Question Paper With Key 2023 : TS SI Arithmetic and Reasoning & Mental Ability Exam కొశ్చ‌న్ పేప‌ర్ & ‘కీ’ ఇదే..

#Tags