Women SI Success Story : ఓ పేదింటి బిడ్డ 'ఎస్ఐ' ఉద్యోగం కొట్టిందిలా.. ఈమె విజ‌యం కోసం..

తెలంగాణ పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా వివిధ విభాగాల్లో ఎస్సై, ఏఎస్సై పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి ఆగస్టు 6వ తేదీన (ఆదివారం) విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితా పోలీస్‌ నియామక మండలి వెబ్‌సైట్‌లో ఆగస్టు 7వ తేదీన (సోమవారం) ఉదయం నుంచి అందుబాటులో ఉంచింది.
అంకెపాక తేజశ్విని

వివిధ విభాగాలకు చెందిన 587 ఉద్యోగాలకు 434 మంది పురుషులు, 153 మంది మహిళల్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎస్సై,ఏఎస్సై పోస్టులకు ఆగస్టు 7వ తేదీ నుంచి టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో కటాఫ్‌ మార్కుల కేటాయింపు, అభ్యర్థుల జన్మతేదీ వంటి వివరాలు వెల్లడిస్తామన్నారు.

ఓ తాపీ మేస్త్రీ కూతురు..

ఈ ఫ‌లితాల్లో చాలా మంది పేదింటి బిడ్డ‌లు.. మట్టిలో మాాణిక్యాలులా.. ఉద్యోగం కొట్టి త‌మ స‌త్తాచాటారు. ఓ తాపీ మేస్త్రీ కూతురు ఎస్ఐ ఉద్యోగానికి ఎన్నికైంది. నల్గొండ జిల్లా వేముల పల్లి మండలం సల్క్ నూర్ గ్రామానికి చెందిన అంకెపాక తేజశ్విని ఎస్ఐ ఫలితాల్లో విజయం సాధించింది. తమ కూతురు ఈ ఉద్యోగానికి ఎంపిక అవ్వడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్య‌క్తం చేశారు.

ఓ తాపీ మేస్త్రీ కూతురు ఎస్ఐ జాబ్ సాధించడం గర్వంగా ఉందని గ్రామస్థులు.. ఆమెను అభిందనల్లో ముంచేస్తున్నారు. కష్టే ఫలి అని మరోసారి పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు నిరూపిస్తున్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని తెలిసి.. చదువుకుని, ఉన్నత శిఖరాలకు ఎదిగారు ఈమె. అంకెపాక తేజశ్విని స‌క్సెస్ మ‌న అంద‌రికి స్ఫూర్తిదాయ‌కం.

☛ Babli Kumari Success Story : ఒకప్పుడు నేను సెల్యూట్ చేసే అధికారులకు నేడు నేనే బాస్‌.. ఈ క‌సితోనే..

ముఖ్యమైన తేదీలు.. కావాల్సిన పత్రాలు ఇవే..
శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 9 నుంచి 11 వరకు ఆన్‌లైన్‌లో ప్రత్యేక ఫార్మాట్‌లో వారిపై ఉన్న కేసులు, మెడికల్‌ అంశాల వివరాలు అటెస్టేషన్‌ చేయించాలని సూచించారు. అటెస్టేషన్‌ కాపీని ఏ4 సైజులో ప్రింట్‌ తీసి, వాటిపై పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు అంటించి మూడు కాపీల్లో గెజిటెడ్‌ అధికారితో సంతకాలు చేయించి వాటిని సూచించిన కేంద్రాల్లో ఆగస్టు 14 నాటికి అందజేయాలని పేర్కొన్నారు.

☛ Sheshadrini Reddy IPS Success Story : ఆన్‌లైన్‌లో స్ట‌డీమెటీరియల్‌ ఫాలో అవుతూ.. ఐపీఎస్ సాధించానిలా.. కానీ

ఎంపిక ప్రక్రియలో సందేహాల నివృత్తికి సైతం నియామక మండలి అవకాశం కల్పించింది. ఆగస్టు 7వ తేదీ నుంచి 9 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో సందేహాలు నివృత్తికి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు ఎస్సీ, ఎస్టీలకు రూ.2వేలు, ఇతరులకు రూ.3వేలు ఆన్‌లైన్‌లో చెల్లించాలని బోర్డు అధికారులు పేర్కొన్నారు.

☛➤ టీఎస్ ఎస్సై, ఏఎస్సై పోస్టుల కటాఫ్‌ మార్కుల కోసం క్లిక్ చేయండి

☛➤ టీఎస్‌ ఎస్సై, ఏఎస్సై పోస్టుల‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం క్లిక్ చేయండి 

☛➤ టీఎస్‌ ఎస్సై, ఏఎస్సై పోస్టుల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి

#Tags