TS Constable Jobs : తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫ‌లితాల్లో.. ఒకే ఇంట్లో నుంచి నలుగురు సెలెక్ట్ అయ్యారిలా.. ఇంకా చాలా కుటుంబాల్లో..

తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫ‌లితాల్లో.. విచిత్రాలు ఎన్నో చోటుచేసుకున్నాయి. ఒకే కుటుంబంలో ఇద్ద‌రికి, ముగ్గురికి, నలుగురికి కానిస్టేబుల్ కొలువులు వచ్చాయి. దీంతో, ఆ కుటుంబ సభ్యులు, అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
Four Persons Selected Constable Job From Same Family

ఒకే ఇంట్లో న‌లుగురికి..
సంగారెడ్డి జిల్లా సిర్దాపూర్ మండలం జమ్లా తాండకు చెందిన ఒకే కుటుంబంలో నలుగురికి పోలీస్ కానిస్టేబుల్ కొలువులు వచ్చాయి. గ్రామానికి మెగావత్ నెహ్రు నాయక్, మారోని బాయి దంపతుల ఇద్దరు కుమారులు మెగావత్ రమేష్, సంతోష్, కూతురు రేణుక, కోడలు మలోత్ రోజా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. వీరంతా కలిసి పరీక్షలకు సన్నద్ధం కావడంతో విజయం సాధించినట్టు చెప్పుకొచ్చారు. ఇంట్లో నలుగురికి జాబ్‌ రావడం సంతోషం వ్యక్తం చేశారు.

☛ TS SI Selected Candidates Stories : ఒక్కో దశ దాటుతూ.. ఎస్ఐ ఉద్యోగం సాధించామిలా.. నేడు..

వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చి..
ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం మల్లవరం నుంచి 13మంది కానిస్టేబుళ్లు ఎంపికయ్యారు. ఎక్సైజ్ కానిస్టేబుళ్లుగా ఉపేందర్, హరీష్, సివిల్లో సైదులు, శ్రీకాంత్, ఎఆర్లో తిరుపతిరావు, కటికి ప్రవళిక, టిఎస్ఎస్పీలో రవీందర్,పవన్, దుగ్గిదేవర వంశీ, యర్రి లక్ష్మణరావు, శ్రీహరి, వరుణ్, ఎస్పీఎఫ్ లో రాంమోహన్ లు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. అలాగే చింతకాని మండలంలో ఏడుగురు కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఎంపికయ్యారు. వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చి గవర్నమెంట్ జాబ్ సాధించడం పట్ల గ్రామస్థులు అభినందిస్తున్నారు. మునుముందు ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు.

☛ Selected for SI Post: ఉద్యోగంలో విధులు నిర్వ‌హిస్తూనే ఎస్ఐగా ఎంపిక‌


ఒకే కుటుంబం చెందిన ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు..

ఈ ఇంటిలో పోలీసు ఉద్యోగాల పంట పండింది. ఒకే కుటుంబం చెందిన ప్రత్యూష, వినూష అక్కాచెల్లెళ్లు. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామకబోర్డు విడుద‌ల చేసిన తుది ఫ‌లితాల్లో ఈ అక్కాచెల్లెళ్లు ఒకేసారి కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరి తండ్రి మర్థ శ్రీనివాస్‌. ఈయ‌న వరంగల్ జిల్లాలోని కొత్తూరు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. త‌ల్లి అంజలి.  వీరి కుమార్తెలు ప్రత్యూష, వినూష. వీరు కానిస్టేబుల్‌ ఈవెంట్స్‌లో ఉత్తీర్ణత సాధించి పరీక్షలు రాశారు. ఇందులో ఓపెన్‌ కేటగిరీలో ఇద్దరు 111 మార్కులు సాధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు వారిని అభినందించారు. అలాగే వీరి మండల పరిధిలో పలువురు కానిస్టేబుల్‌ ఉద్యోగాలు సాధించారు.

☛ Success Stories : ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా.. చిన్న స్థాయి నుంచి..

తెలంగాణ‌లోని కొన్ని గ్రామాల్లోని మూడు కుటుంబంలకు చెందిన ముగ్గురేసి అన్నదమ్ములు కానిస్టేబుల్‌ కొలువులు సాధించి అంద‌రి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.కుమురంభీం జిల్లాల్లో చింతలమానేపల్లి మండలం బాబాసాగర్‌కు చెందిన వెన్నంపల్లి శివలింగం-శంకరమ్మ దంపతుల ముగ్గురు కుమారులు ఉపేందర్‌ (సివిల్‌), మహేందర్‌ (సివిల్‌), విజయ్‌ (టీఎస్‌ఎస్‌పీ)లు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

☛ Constables Success Stories : ఈ ఆరుగురు కానిస్టేబుల్స్‌.. ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా..

అలాగే పెంచికల్‌పేట్‌ మండలం చేడ్వాయికి చెందిన మాధవ్‌-సునీత దంపతుల కుమారులు వెంకటేశ్‌ (టీఎస్‌ఎస్పీ), కవలలైన రామ్‌ (ఏఆర్‌), లక్ష్మణ్‌ (టీఎస్‌ఎస్పీ)లు కానిస్టేబుల్‌ పరీక్షల్లో సత్తా చాటారు.

వీరితో పాటు కౌటాల మండలం వీర్దండికి చెందిన అన్నదమ్ములు ఈర్ల వంశీకృష్ణ (టీఎస్‌ఎస్పీ), శివకృష్ణ (సివిల్‌), సాయికృష్ణ (ఏఆర్‌) పోలీస్ కొలువుకి ఎంపికకావడంతో తల్లిదండ్రుల ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయింది. ఈ విధంగా కుమురంభీం జిల్లాల్లో మూడు ఫ్యామిల్లీలో ముగ్గురేసి ఎంపికతో గ్రామ‌స్తులు, వీరి తల్లిదండ్రులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

☛ SI Inspirational Success Story : ఈ బల‌మైన సంక‌ల్పంతోనే.. ఎస్సై ఉద్యోగం కొట్టా.. ఎందుకంటే..?

ఈ ముగ్గురు కుమారులు.. పోలీసు ఉద్యోగాలు కొట్టారిలా..

అలాగే ఈ ఫ‌లితాల్లో మెద‌క్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ గ్రామానికి చెందిన సంగు శ్రావణ్, ప్రశాంత్ సందీప్ ఒకే కుటుంబం చెందిన ఈ ముగ్గురు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. సంగు దుర్గయ్య-సంగు లక్ష్మికి ముగ్గురు కుమారులు. తెలంగాణ కానిస్టేబుల్‌ పరీక్షల్లో ఈ ముగ్గురు కుమారులు అర్హత సాధించి పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగంకు ఎంపిక‌య్యారు. సంగు శ్రావణ్ (టిఎస్ఎస్‌పీ) పీసి, సంగు ప్రశాంత్ (ఏఆర్) పీసీ, సంగు సందీప్ (టిఎస్ఎస్‌పీ) పీసీగా ఉద్యోగాలు సాధించారు. దీంతో వీరి తల్లిదండ్రులు సంతోషంతో మునిగిపోయారు. గ్రామ ప్రజలు కూడా ఆ ముగ్గురిని అభినందించారు. కష్టపడి చదివితే విజయం తప్పకుండా సాధించ‌వ‌చ్చ‌ని నిరూపించారు ఈ ముగ్గురు.

☛ Success Stories : ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా.. చిన్న స్థాయి నుంచి..

#Tags