TS Police: వయోపరిమితి, దరఖాస్తు తేదీ, కనీస ఎత్తు పెంపు..

పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వయోపరిమితిలో మరింత సడలింపు ఇవ్వాలని నిరుద్యోగులు చేస్తున్న విజ్ఞప్తిపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సానుకూలంగా స్పందించారు.
వయోపరిమితి, దరఖాస్తు తేదీ, కనీస ఎత్తు పెంపు..

వయోపరిమితిని మరో రెండు సంవత్సరాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95% స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడం, గత కొన్నేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం, రెండేళ్ల కరోనా పరిస్థితుల నేపథ్యంలో.. పోలీసు ఉద్యోగాల వయోపరిమితిలో ఇప్పటికే ఇచ్చిన మూడేళ్లు కాకుండా మరింత సడలింపు ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సానుకూల నిర్ణయం తీసుకున్న సీఎం.. దీనికి సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాలి్సందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని ఆదేశించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మే20 తోనే గడువు ముగియాల్సి ఉంది. కానీ సీఎం తాజా ఆదేశాల నేపథ్యంలో దీనిని మే 26 వరకు పొడిగిస్తూ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 11 లక్షల మేరకు దరఖాస్తులు రాగా.. ఈ వయోపరిమితి సడలింపుతో మరో 3 లక్షల మేరకు దరఖాస్తులు వస్తాయని అధికారవర్గాలు అంచనా వేశాయి. కాగా గ్రూప్‌–1 కింద ఉన్న డీఎస్పీ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల కనీస ఎత్తును 167 సెంటీమీటర్ల నుంచి 165 సెంటీమీటర్లకు తగ్గించడానికి కూడా సీఎం అంగీకరించారని పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. 

చదవండి: 

​​​​​​​TS Police Exams: రాతపరీక్షలో నెగిటివ్‌ మార్కులు ఉన్నాయ్‌.. జాగ్రత్తగా రాయండిలా..

TS Government Jobs: మరో 677 ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..

​​​​​​​ఇవి ఫాలో అయితే.. పోలీసు ఉద్యోగం మీదే || Telangana Police Jobs 2022|| SI, Constable Jobs||Events

#Tags