TSWREIS Admission Notification: గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ ప్రవేశాలు, ఎంపిక ఇలా..

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి కరీంనగర్ జిల్లా రుక్మాపూర్‌లోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ (CBSE-BOYS)లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు ఐఐటీ, నీట్‌ తదితర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ఇంటెన్సివ్ కోచింగ్‌ కూడా ఉచితంగా కల్పిస్తారు. 

గ్రూప్‌: ఎంపీసీ
సీట్ల సంఖ్య: 46( కేవలం అబ్బాయిలకు మాత్రమే)

అర్హత: ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదోతరగతి చదువుతున్నవారు దరఖాస్తుకు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలకు మించకూడదు.

వయోపరిమితి: 01.04.2024 నాటికి 16 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్ విద్యార్థులకు రెండేళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.200.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం:  స్క్రీనింగ్ పరీక్ష(లెవెల్‌-1, 2); రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

ప్రవేశ పరీక్ష విధానం..
మొత్తం 160 మార్కులకు స్క్రీనింగ్ పరీక్ష-1 నిర్వహిస్తారు.
మొత్తం 150 మార్కులకు స్క్రీనింగ్ పరీక్ష-2 నిర్వహిస్తారు.

  
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: మార్చి 01, 2024
హాల్‌టిక్కెట్ డౌన్‌లోడ్ తేదీలు: మార్చి 06 నుంచి
స్క్రీనింగ్ పరీక్ష-1 తేది: మార్చి 10, 2024
స్క్రీనింగ్ పరీక్ష-2 తేది: ఏప్రిల్‌ 01, 03, 04, 06 తేదీల్లో

#Tags