TSBIE: ఇంటర్‌ ఫలితాలు వివరాలు.. రోజుకు ఇన్ని సమాధాన పత్రాలకు మూల్యాంకన

సాక్షి, హైదరాబాద్‌: మే రెండో వారంలో ఇంటర్‌ పరీక్ష ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకవేళ ఆలస్యమైతే మూడో వారం ఫలితాలు ఇవ్వొచ్చని బోర్డ్‌ అధికారులు తెలిపారు.
ఇంటర్‌ ఫలితాలు వివరాలు.. రోజుకు ఇన్ని సమాధాన పత్రాలకు మూల్యాంకన

ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన దాదాపు 9 లక్షలకుపైగా విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాశారు. మొత్తం 60 లక్షల జవాబు పత్రాలను అధ్యాపకులు మూల్యాంకన చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15 మూల్యాంకన కేంద్రాల్లో ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది. ఒక్కో అధ్యాపకుడు రోజుకు 30 సమాధాన పత్రాలకు మూల్యాంకన చేస్తున్నారు.

చదవండి: Best Courses After 12th BiPC: బైపీసీతో... క్రేజీ కోర్సులివే!

ఎగ్జామినర్, చీఫ్‌ ఎగ్జామినర్, సబ్జెక్టు నిపుణుడు, స్క్రూటినైజర్‌ ... ఇలా నాలుగు దశల్లో మూ ల్యాంకనను పరిశీలించిన తర్వాత మార్కులు బోర్డ్‌కు చేరుతాయి. బోర్డ్‌లో క్రాస్‌ వెరిఫికేషన్‌ చేపట్టి తర్వాత డీ కోడింగ్‌ చేసి, సీజీజీకి డేటాను పంపుతారు. ఈ ప్రక్రియ వేగంగా సాగుతోందని ఇంటర్‌ పరీక్షల విభాగం అధికారి జయప్రదాభాయ్‌ తెలిపారు. 

చదవండి: Best Course After Intermediate MPC: ఎంపీసీ.. ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో!

#Tags