TS Inter Results 2024: ఇంటర్‌లో ఫస్ట్‌క్లాస్‌ మార్కులతో పాసయ్యాడు.. కానీ ఫలితాలు చూసుకోకుండానే మృతి

హైదరాబాద్: అనారోగ్యంతో పోరాడుతూనే ఇంటర్‌ పరీక్షలు రాశాడు.. భవిష్యత్తు బాగుండాలని అందరిలానే కలలు కన్నాడు.. బుధవారం వెలువడిన ఇంటర్‌ ఫలితాల్లో పస్ట్‌క్లాస్‌ మార్కులతో పాసయ్యాడు.. కానీ తన రిజల్ట్స్‌ చూసుకోకుండానే విధి వక్రీకరించడంతో సదరు బాలుడు మృతిచెందాడు..

వివరాల్లోకెళితే గాజులరామారం డివిజన్‌ రోడామేస్త్రీనగర్‌కు చెందిన మీర్జా నయీమ్‌బేగ్, అస్రాబేగంలకు కుమారుడు మీర్జా హంజాబేగ్‌(17) ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

Students Commit Suicide After Inter Results: ఏడుగురు ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్య.. ఫెయిలవుతాననే భయంతో సూసైడ్‌, కానీ రిజల్ట్స్‌లో పాస్‌

అయినా పట్టుదలతో చదివి 10వ తరగతి పరీక్షల్లో పస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు. అనంతరం ఇంట్లోనే విశ్రాంతి తీసుకోమ్మని తల్లిదండ్రులు కోరినా చదవాలనే కోరికతో ఐడీపీఎల్‌లోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌లో అడ్మిషన్‌ తీసుకున్నాడు.

మార్చి 2024లో అనారోగ్యంతో పోరాడుతూనే ఇంటర్‌ పరీక్షలు రాశాడు. ఆరోగ్యం క్షీణించడంతో అస్పత్రిలో చేరిన హంజాబేగ్‌ చికిత్స పొందుతూ మార్చి 27న మృతి చెందాడు. బుధ వారం ఇంటర్‌ ఫలితాలు చూసిన తల్లిదండ్రు లు తమ కుమారుడు 671మార్కులతో పాసయ్యాడని తెలుసుకుని బోరున విలపించారు. 

#Tags