Admissions: మోడల్‌ కళాశాలలో ప్రవేశాల ఎంపిక జాబితా విడుదల

ఆసిఫాబాద్‌ రూరల్‌: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి ఎంపిక జా బితాను విడుదల చేసినట్లు ప్రిన్సిపాల్‌ అబ్దుల్‌ ఖలీల్‌ తెలిపారు.

మెరిట్‌ రోస్టర్‌ ప్రకారం గ్రూపులో 40 చొప్పున మొత్తం 160 మంది విద్యార్థులను ఎంపిక చేశామన్నారు. ఎంపికై న వారి జాబితాను కళాశాలలోని నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

జూన్ 8లోగా ఒరిజినల్‌ టీసీ, బోనఫైడ్‌, పదో తరగతి మెమో, ఆధార్‌ కార్డు, రెండు ఫొటోలు, రెండు సెట్ల జిరాక్సులతో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని సూచించారు. ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాని విద్యార్థుల అడ్మిషన్‌ రద్దవుతుందని స్పష్టం చేశారు.

#Tags