Admissions: కార్పొరేట్‌ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. ప్రవేశాలకు ఇవి తప్పనిసరి

7జీపీఏ, ఆ పైగా ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూళ్లలో చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులు ప్రవేశం పొందే అవకాశం ఉందన్నారు. జూన్‌ 3న సీజీజీ ఆన్‌లైన్‌ ఆటోమెటిక్‌ సిస్టమ్‌ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారని, జూన్‌ 6న ఎస్సీ కార్యాలయ అధికారులు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేస్తారన్నారు.

చదవండి: TS EAPCET 2024: ఈ మార్కులు వస్తే టాప్ కాలేజీల్లో Computer Science Engineering (CSE)!

అర్హులు కుల, ఆదాయం, పదో తరగతి పాస్‌ మార్కుల మెమో, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌, దివ్యాంగ ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్స్‌ (నాలుగు నుంచి పదో తరగతి వరకు తెలంగాణలో చదివి ఉండాలి) హాస్టల్‌ బోనఫైడ్‌ సర్టిఫికెట్‌, రెండు పాస్‌ఫొటోలు అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

#Tags