Inter Admissions: ఇంటర్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ఉట్నూర్‌ రూరల్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని తోటి, కొలాం, కోలావర్‌ తెగలకు చెందిన గిరిజన విద్యార్థుల నుంచి గురుకుల పీవీ టీజీ ప్రతిభ కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు.

2023–24 విద్యాసంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన బాలబాలికలు అర్హులని పేర్కొన్నారు. మే 30న ఉదయం 10గంటలకు గిరిజన గురుకుల జూనియర్‌ కళాశాల(బాలికలు) ఉ ట్నూర్‌ కేబీ కాంప్లెక్స్‌లో ప్రవేశానికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు.

చదవండి: Best Courses After Inter: ఇంటర్‌ తర్వాత చదవడానికి అవకాశం ఉన్న టాప్‌ 100 కోర్సులు.. వాటి వివరాలు..

కౌన్సెలింగ్‌కు వచ్చే విద్యార్థులు మెమో, బోనాఫైడ్‌, టీసీ, కుల, ఆదాయ, ఫిజికల్‌ఫిట్నెస్‌, ఆధార్‌, నిజ ధ్రువీకరణ పత్రాలు, రెండు జతల జిరాక్స్‌, పాస్‌ఫొటోలతో హాజరు కావాలని కోరారు.
 

#Tags