Intermediate Exams : ఒకే ప్రశ్న పత్రంతో ఇంటర్మీడియెట్ విద్యార్థులు పరీక్ష రాసే విధంగా పకడ్బందీగా ఏర్పాట్లు
శ్రీకాకుళం : ఇంటర్మీడియెట్ విద్యార్థులకు మంగళవారం నుంచి అర్ధసంవత్సర పరీక్షలు జరగనున్నాయి. గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విధంగా ఇంటర్మీడియెట్ విద్య త్రైమాసిక, అర్ధ సంవత్సర పరీక్షల్లో సరికొత్త రాష్ట్రవ్యాప్తంగా ఒకే ప్రశ్న పత్రంతో విద్యార్థులు పరీక్ష రాసే విధంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పరీక్షకు ముందు ప్రశ్న ప త్రం కాలేజ్‌ల లాగిన్ ద్వారా ప్రిన్సిపాల్‌కు చేరుతుంది. ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా క్వశ్చన్‌పేపర్ డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటౌట్స్ తీసి, కళాశాలల్లో నిర్దిష్టమైన సమయానికి విద్యార్థులకు అందజేసి పరీక్షలను రాయించనున్నారు.
ఇదీ చదవండి: ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు తేదీలు విడుదల..
పరీక్షల నిర్వహణపై డీవీఈఓ శివ్వాల తవిటినాయుడు ఆర్‌ఐఓ ప్రగడ దుర్గారావు ప్రిన్సిపాళ్లతో పలుమార్లు ఏర్పాట్లపై సమీక్షించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫస్టియర్‌కు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకెండియర్ విద్యార్థులకు అర్ధ సంవత్సర పరీక్షలను నిర్వహిస్తున్నారు. పరీక్షల ముగిసిన వెంటనే జవాబుపత్రాల దిద్దుబాటు ను పూర్తిచేసి ఆన్‌లైన్‌లో మార్కులు అప్‌లోడ్ చేయాలి. పరీక్షల ఫలితాలపై జిల్లా అధికారులు, ఇంటర్‌బోర్డు అధికారులు సమీక్షించనున్నారు.
ఇదీ చదవండి: TG Intermediate Time Table 2025: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల