KGBV: కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల ఉన్నతీకరణ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోని 38 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను ఇంటర్మీడియెట్‌ వరకు ఉన్నతీకరించినట్టు విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు.
కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల ఉన్నతీకరణ

వీటిలో 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ ఫస్టియర్, 2024–25 నుంచి సెకండియర్‌ క్లాసులు మొదలవుతాయని మంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా రూ.7.60 కోట్ల భారం పడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 475 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు ఉండగా, ఇప్పటివరకు 245 విద్యాలయాలను ఇంటర్మీడియెట్‌ వరకు అప్‌గ్రేడ్‌ చేసినట్టు పేర్కొన్నారు.

చదవండి: Telangana Govt Jobs: కేజీబీవీల్లో 1241 పోస్టులు.. పరీక్ష స్వరూపం, ప్రిపరేషన్‌ తదితర వివరాలు ఇవే..

ప్రస్తుతం 38 కస్తూర్బా గాంధీ బాలికావిద్యాలయాలను అప్‌గ్రేడ్‌ చేయడం వల్ల ఈ సంవత్సరం 3,040 మంది బాలికలకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. 475 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో 1,33,879 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. తాజాగా అప్‌గ్రేడ్‌ చేసిన విద్యాలయాల్లో రెండేసి గ్రూపులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.  

చదవండి: KGBV: కేజీబీవీల్లో పోస్టులకు స్కిల్‌ టెస్ట్‌లు

#Tags