10th Class: ఎస్సెస్సీలో వంద శాతం ఫలితాలే లక్ష్యం.. వెనకబడిన విద్యార్థులకు ఇలా..
కొణిజర్ల/కల్లూరు రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత నమోదయ్యేలా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని డీఈఓ ఈ. సోమశేఖరశర్మ సూచించారు.
కొణిజర్ల మండలం పల్లిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బస్‌స్టేషన్ ప్రాథమిక పాఠశాలలతోపాటు కల్లూరులోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను జనవరి 24న ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులను పలు సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమైన డీఈఓ వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సుజాత, కనకవల్లి, పద్మావతి, ఎల్లారెడ్డి, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
#Tags