K Srinivas: విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి

ములుగురూరల్‌: గిరిజన పాఠశాలల్లోని విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్థమయ్యేలా బోధించాలని ఐటీడీఏ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ప్యానల్‌ టీం హెడ్‌ కె. శ్రీనివాస్‌ అన్నారు.

ఐటీడీఏ పీఓ అంకిత్‌, డీడీ పోచం ఆదేశాల మేరకు న‌వంబ‌ర్‌ 22న‌ మండల పరిధిలోని జగ్గన్నపేట పాఠశాలలో ప్యానెల్‌ టీంకు చెందిన 10 మంది సభ్యులు ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు పలు అంశాలపై అడిగి తెలుసుకున్నారు.

చదవండి: Somasekhara Sharma: జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ జిల్లాస్థాయి ప్రదర్శన

హాస్టల్‌ నిర్వహణ, హెల్త్‌, హైజానిక్‌, గేమ్స్‌, స్పోర్ట్స్‌, అథ్లెటిక్స్‌, లైబ్రరీ, భవన సముదాయాలను, అకౌంట్స్‌ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి ఏ గ్రేడ్‌ కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమ్మయ్య, బుచ్చయ్య, లక్ష్మినారాయణ, యాకమ్మ, అశోక్‌, నారాయణ, విజయలలిత, పాఠశాల హెడ్మాస్టర్‌ వేణుగోపాల్‌, లక్ష్మి, రమాదేవి, బన్సిలాల్‌, పరంసింగ్‌, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

#Tags