School Education Department: స్కూల్‌ యూనిఫాం తయారీకి ప్రణాళిక

కాళోజీ సెంటర్‌: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ రెండు జతల చొప్పున ఏకరూప దుస్తుల (యూనిఫాం)ను పంపిణీ చేయడానికి ముందస్తు ప్రణాళిక రూపొందించింది.

ఇందులో భాగంగా విద్యార్థుల సంఖ్య ఆధారంగా కుట్టు కూలి చార్జీలు, యూనిఫాం ఆకృతులతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో జతకు కుట్టు కూలిగా రూ.50 చొప్పున రెండు జతలకు రూ.100 చెల్లించడానికి నిధులు కేటాయించారు. జిల్లాలో బాలురు 18,182 మంది, బాలికలు 19,838 మంది.. మొత్తం 38,020 మంది విద్యార్థులకు యూనిఫాం అందించనున్నారు.

తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం (టీఎస్‌ హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ సొసైటీ) ద్వారా విద్యార్థులకు యూనిఫాం క్లాత్‌ పంపిణీ చేసి స్ట్రిచింగ్‌ బాధ్యతలను డీఆర్‌డీఏ ద్వారా స్వయం సహాయక సంఘాలకు అప్పగించనున్నారు.

చదవండి: Summer Camp for Inter Students: విజ్ఞానం పెంచేందుకే సమ్మర్‌ క్యాంప్‌

కుట్టు పనిలో నైపుణ్యం కలిగిన స్వయం సహాయక బృందాలను గుర్తించి వారికి విద్యార్థుల కొలతలు అందించే ప్రక్రియ ఈనెల చివరి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థుల కొలతలు తీసుకొని ప్రభుత్వం నిర్దేశించిన ఆకృతుల్లో యూనిఫాం తయారు చేసి జూన్‌ 1 నాటికి పాఠశాలలకు అందించాలి.

యూనిఫాం ఇలా..

విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో యూనిఫాం ఆకృతులను గతేడాది ప్రభుత్వం నిర్దేశించింది. ఒకటో తరగతి నుంచి మూడో తరగతి చదువుతున్న బాలికలకు ఫ్రాక్‌తో కూడిన డ్రెస్‌, 4, 5వ తరగతి బాలికలకు స్కర్ట్‌, 6వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలకు పంజాబీ డ్రెస్‌ ఆకర్షణీయంగా డిజైన్‌ చేశారు.

అదేవిధంగా ఒకటి నుంచి ఏడో తరగతి చదువుతున్న బాలురకు షర్ట్‌, నిక్కర్‌, 8 నుచి 12వ తరగతి బాలురకు షర్ట్‌, ప్యాంటుతో పాటు బూడిద రంగు చెక్స్‌ కలిగిన క్లాత్‌ నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం ద్వారా యూనిఫాం క్లాత్‌ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

జూన్‌ 1న పంపిణీ చేసేలా ప్రణాళిక

పాఠశాల విద్యా కమి షనర్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని 38,020 మంది విద్యార్థులకు జూన్‌ 1న యూనిఫాం పంపిణీ చేసేలా ప్రణా ళిక రూపొందించాం. డీఆర్‌డీఏ సహకారంతో పొదుపు సంఘాల మహిళలకు డ్రెస్‌లు కుట్టించే బాధ్యతలు అప్పగించేందుకు శ్రీకారం చుట్టాం. ఈ నెల చివరి నాటికి విద్యార్థుల కొలతలు తీసుకుంటారు.
– డి.వాసంతి, డీఈఓ
 

#Tags