Tenth Class Public Exams 2024: పదో తరగతి విద్యార్థులకు హెల్ప్‌లైన్‌

పదో తరగతి విద్యార్థులకు హెల్ప్‌లైన్‌
Tenth Class Public Exams 2024: పదో తరగతి విద్యార్థులకు హెల్ప్‌లైన్‌

విద్యారణ్యపురి: పదో తరగతి ఫలితాల్లో హనుమకొండ జిల్లాను రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపే లక్ష్యంతో ఈనెల 18వ తేదీనుంచి జిల్లా విద్యాశాఖ.. అన్ని సబ్జెక్టుల విషయ నిపుణులతో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది. విద్యార్థులు సబ్జెక్టుపై ఉన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేసుకునేలా ప్రతి సబ్జెక్టుకు ఇద్దరు నిపుణులను కేటాయించింది. వారి ఫోన్‌నంబర్లను కూడా తెలిసేలా పత్రికలకు విడుదల చేసింది. నిపుణుల వివరాలను ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేక అధికారులు, ప్రిన్సిపాళ్లు పదవ తరగతి అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థికి చేరేలా చూడాలని డీఈఓ ఎండీ అబ్దుల్‌ హై బుధవారం తెలిపారు. ప్రతి పాఠశాలలో ఇప్పటికే ఉపాధ్యాయులు సిలబస్‌ పూర్తి చేసి, ప్రీ ఫైనల్‌ పరీక్షలు కూడా నిర్వహించారు. విద్యార్థులకు జవాబు పత్రాలు ఇచ్చి సూచనలు చేశారు. అయినా ఇంకా సబ్జెక్టు పరమైన సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి, పదవ తరగతి ప్రశ్న పత్రాలపై జవాబులు రాసే విధానంలో ఏమైనా సలహాలు కావాలన్నా విషయ నిపుణులకు ఫోన్‌ చేసి తీసుకోవచ్చని డీఈఓ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వతో పాటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు కూడా ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు.

విషయ నిపుణులు.. ఫోన్‌నంబర్లు

తెలుగు ------   వి.నరేందర్‌రెడ్డి   99088 43426

                       జి.విష్ణుమూర్తి   83285 04601

హిందీ  ------   ఎస్‌కే గౌస్‌ పాషా 96187 17939

                       ఎండీ అజీముద్దీన్‌ 97042 03705

ఆంగ్లం   ------  రోజారాణి 91533 12803

                       డాక్టర్‌ కె.రవికుమార్‌ 99491 08501

గణితం ------    బి.మహేష్‌ 98482 13528

                        వెంకటేశ్వర్లు 95428 94085

భౌతిక శాస్త్రం ----- శశికళాధర్‌ 98665 60782

                             జ్ఞానేశ్వర్‌ 98668 56373

జీవశాస్త్రం ------ డాక్టర్‌ వాసు 98495 00462

                           ఏ.సంపతి 83175 43635

సాంఘిక శాస్త్రం ------ ఈ.నవీన్‌ కుమార్‌ 94901 17077

                                   బి.సతీష్‌ ప్రకాష్‌ 9440 146460

 

 

#Tags