TOSS: ప్రశ్నపత్రం రాక ఆగిన పరీక్ష

ఖమ్మం సహకారనగర్‌: టీఎస్‌పీఎస్సీ, ఎస్సెస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు మరువకముందే.. ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల నిర్వహణలోనూ అధికారుల డొల్లతనం బయటపడింది.
ఎకనామిక్స్‌ పరీక్ష రద్దు చేస్తూ, మే 13కు వాయిదా వేస్తూ డైరెక్టర్‌ విడుదల చేసిన ప్రకటన

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్‌ ఎకనామిక్స్‌ పరీక్షకు తెలుగు మీడియం ప్రశ్నపత్రాన్ని ముద్రించలేదు. దీంతో అందరికీ ఇంగ్లిష్‌ మీడియం ప్రశ్నపత్రాలే రాగా చివరకు పరీక్ష రద్దు చేయాల్సి వచ్చింది. ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఆధ్వర్యాన ఇంటర్‌మీడియట్, పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 25న మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఇంటర్‌ విద్యార్థులకు ఏప్రిల్‌ 2 ఉదయం బయాలజీ/ఎకనామిక్స్, మధ్యాహ్నం అకౌంటెన్సీ పరీక్షలు జరగాల్సి ఉంది. షెడ్యూల్‌ ప్రకారం విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. తెలుగు మీడియం, ఇంగ్లిష్‌ మీడియం అని రాసిన ప్రశ్నపత్రాల బండిళ్లను అధికారులు విప్పగా.. అన్నీ ఇంగ్లిష్‌ మీడియం ప్రశ్నపత్రాలే ఉన్నాయి.

చదవండి: Best Certificate Courses: పదో తరగతి, ఇంటర్‌ అర్హతగా జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సుల వివరాలు ఇవే..

దీనిపై ఆరా తీస్తే అసలు తెలుగు మీడియం ప్రశ్నపత్రాలే ముద్రించలేదని.. అది పరిశీలించకుండానే ముందుగానే సిద్ధమైన కవర్లలో పెట్టి పంపించారని సమాచారం. దీంతో విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించగా తెలుగు మీడియం ఎకనామిక్స్‌ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా రద్దు చేసి మే 13వ తేదీన తిరిగి నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేశారు. దీంతో అంతసేపు వేచిఉన్న అభ్యర్థులు ఉసూరుమంటూ తిరిగి ఇళ్లకు బయల్దేరారు. అయితే, ఎకనామిక్స్‌ ఇంగ్లిష్‌ మీడియం పరీక్ష సహా మిగతా పరీక్షలను షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించారు.

చదవండి: Best Non-Engineering Courses After Inter: ఇంజనీరింగ్‌తోపాటు అనేక వినూత్న కోర్సులు !!

#Tags