Governor: విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన శక్తి వంచనలేకుండా కృషి చేస్తానని, ముందుగా వారికి నైతిక మద్దతు అందిస్తానని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ Tamilisai Soundararajan భరోసా ఇచ్చారు.
గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యూనివర్సిటీల విద్యార్థులను గవర్నర్‌ ఆగస్టు 3న రాజ్‌భవన్‌లో కలిశారు. కాలేజీలు, యూనివర్సిటీల్లో సమస్యలపై విద్యార్థులు ఇచ్చిన విజ్ఞప్తులను గవర్నర్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అనేక మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎంతో ఆసక్తితో ఉన్నత విద్య కోసం యూనివర్సిటీలకు వస్తున్నారని, వారికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యార్థుల సమస్యలను సంబంధిత విభాగాల దృష్టికి తీసుకెళ్తానని, తనకు అవకాశం ఉన్నమేర పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా యూనివర్సిటీ విద్యార్థులకు రాజ్‌భవన్‌లో నిర్వహించే వ్యాసరచన పోటీల్లో పాల్గొనాలని సూచించారు. విద్యార్థులకు ఆమె జాతీయ జెండాలను పంపిణీ చేసి, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 13 నుంచి 15 వరకూ ఇళ్లపై ఎగురవేయాలని కోరారు.

చదవండి: పాఠశాల మ్యాగజైన్ తో సృజనాత్మక శక్తి వృద్ధి

బాసర ట్రిపుల్‌ ఐటీని సందర్శిస్తా

ఈ సందర్భంగా బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గవర్నర్‌ను కలసి, అక్కడి సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చారు. ఒకసారి ట్రిపుల్‌ ఐటీకి రావాలని కోరారు. సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నిస్తానని, త్వరలో అక్కడికి వస్తానని గవర్నర్‌ భరోసా ఇచ్చినట్టు విద్యార్థులు తెలిపారు.

చదవండి:  మానసిక దృఢత్వం, ధైర్యంతో ఉంటేనే పరీక్షల్లో విజయం

#Tags