CM Revanth Reddy: గురుకుల విద్యార్థినికి అండగా సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల పాఠశాల భవనంపైనుంచి కిందపడి తీవ్ర గాయాలపాలైన విద్యా ర్థిని కొయ్యడ కార్తీకకు సీఎం రేవంత్‌రెడ్డి అండగా నిలిచారు.

సీఎం సూచన మేరకు హైదరా బాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో కార్తీకకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం కార్తీక కోలుకుంటోంది.

ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కార్తీక ఈ నెల 9న ప్రమాదవశాత్తు స్కూల్‌ మూడో అంతస్తు నుంచి పడిపోయింది. దీంతో విద్యార్థిని  నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.

చదవండి: Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే మూడు వేల పోస్టుల భర్తీ

నిమ్స్‌ న్యూరో సర్జన్‌  అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌  డాక్టర్‌  తిరుమల్‌ బృందం ఆగ‌స్టు 13న‌ కార్తీకకు  ఆపరేషన్‌ నిర్వహించింది. ప్రస్తుతం విద్యార్థిని కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు.

ముఖ్యమంత్రి కార్యాలయం  ఓఎస్డీ వేముల శ్రీనివాసులు నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్పతో మాట్లాడి కార్తీక  కోలుకునేంత వరకు వైద్యం అందించాలని సూచించారు.  

#Tags