Education: కార్పొరేట్‌కు దీటుగా బోధన
మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌ని ఆగస్టు 13న ఆయన సందర్శించారు. స్కూల్‌లో ఉన్న సైన్స్, కంప్యూటర్, బోటనీ, జువాలజీ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్, గ్రంథాలయాన్ని పరిశీలించారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ మోడల్ స్కూళ్లలో అనుభవంతో కూడిన ఉపాధ్యాయులు, అధ్యాపకులతో నాణ్యమైన విద్యా బోధన అందిస్తున్నామని తెలిపారు. విశాలమైన తరగతి గదులు, మైదానంతో పాటు, వసతి సౌకర్యం కల్పిస్తున్నట్టు చెప్పారు.
చదవండి: Cyberabad Police: విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నిరోధక కమిటీలు
మహేశ్వరం మోడల్ స్కూల్ ఇతర మోడల్ స్కూళ్లకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. స్కూల్‌కి చెందిన ఇద్దరు విద్యార్థులు ఇటీవల ట్రిపుల్ ఐటీకి ఎంపిక కావడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ట్రిపుల్ ఐటీకి ఎంపికై న కాట్రావత్ శివ, ముడావత్ సిద్ధుతో పాటు ప్రిన్సిపాల్, అధ్యాపకులను అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో అకాడమీ మానిటరింగ్ అధికారి మంజరి, మహేశ్వరం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బి.ధనుంజయ్, ఉపాధ్యాయులు నాగకళ, రెహానా, మాధవి తదితరులు పాల్గొన్నారు.