Tenth Class Public Exams 2024: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో మెరుగైన ఫలితాలతో ... లక్ష్యంగా

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో మెరుగైన ఫలితాలతో ... లక్ష్యంగా
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో మెరుగైన ఫలితాలతో ... లక్ష్యంగా

ఆదిలాబాద్‌టౌన్‌: పదో తరగతిలో అగ్రస్థానమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం.. ఆ దిశగా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశాం. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి పరీక్షల్లో విజయం సాధించేలా సన్నద్ధం చేస్తున్నాం. ప్రతీ విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక తరగతులు బోధిస్తున్నాం. నిపుణులైన ఉపాధ్యాయులతో విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయిస్తున్నాం.. పబ్లిక్‌ పరీక్షల్లో గతేడాది కంటే ఈసారి మెరుగైన ఫలితాలతో టాప్‌ ‘టెన్‌’లో నిలిచేలా చూస్తున్నాం.. రివిజన్‌ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి టి.ప్రణీత అన్నారు. ఆదివారం ‘సాక్షి’ నిర్వహించిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.

సాక్షి: ‘పది’లో మంచి ఫలితాల సాధన కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?

డీఈవో: పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాఽ దించేలా చర్యలు చేపడుతున్నాం. ప్రతీరోజు ఉ దయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులకు ప్ర త్యేక తరగతులు బోధిస్తున్నాం. గ్రూపులుగా విభజించి చదువులు కొనసాగిస్తున్నాం. అభ్యాస దీపికలు అందజేశాం. ప్రతీరోజు స్లిప్‌ టెస్టులు ని ర్వహిస్తున్నాం. ఉపాధ్యాయులు రాత్రి వేళల్లో వి ద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చదివించాలని సూచిస్తున్నారు. పరీక్షలు అయ్యేంత వరకు టీవీ, సెల్‌ఫోన్‌లకు దూరంగా ఉంచాలని పేర్కొంటున్నారు. అలాగే శుభకార్యాలు, విందులు, వినోదాలకు దూరంగా ఉంచాలని చెబుతున్నారు.

సాక్షి: జిల్లాలో గతేడాది ఫలితాలు ఎలా ఉన్నాయి.. ఈసారి ఎన్నోస్థానంలో ఉండవచ్చు?

డీఈవో: జిల్లాలో గతేడాది పదో తరగతి ఫలితాల పరంగా 88.68 శాతం ఉత్తీర్ణత సాధించి 19వ స్థానంలో నిలిచాం. రాష్ట్రస్థాయిలో జిల్లాకు 19వ స్థానం దక్కింది. ప్రస్తుతం మంచి ఫలితాలు సా ధించేలా ప్రణాళికాబద్ధంగా విద్యాబోధన చేపట్టాం. ఈసారి మరింత మెరుగైన ఫలితాల కో సం కృషి చేస్తాం. వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు వందరోజుల ప్రణాళికను

తయారుచేశాం.

సాక్షి: ఎస్సెస్సీ పబ్లిక్‌ పరీక్షలు

ఎంతమంది రాయనున్నారు?

Also Read : TS Telugu Study Material 

డీఈవో: మార్చి 18 నుంచి 30వ తేది వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఏప్రిల్‌ 1న ఒకేషనల్‌ పరీక్ష నిర్వహించబడుతుంది. రెగ్యులర్‌ విద్యార్థులు 10,401 మంది, ప్రైవేట్‌ విద్యార్థులు 53 మంది, మొత్తం 10,454 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు.

సాక్షి: పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు?

డీఈవో: వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తాం. దీనికి సంబంధించి కలెక్టర్‌ అధ్యక్షతన సమావేశం జరగనుంది. పరీక్ష కేంద్రంలో తాగునీరు, విద్యుత్‌, వైద్యసేవలు, బెంచీలు ఏర్పాటు చేస్తాం. ఏ ఒక్క విద్యార్థికి సమస్య ఎదురుకాకుండా చర్యలు చేపడతాం.

సాక్షి: పరీక్ష నిర్వహణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?

డీఈవో: జిల్లా వ్యాప్తంగా 53 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. పరీక్ష నిర్వహణ కోసం 53 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 54 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, 13 సీ–కేటగిరీ కేంద్రాలకు 13 మంది కస్టోడియన్‌లను నియమించాం. మూడు స్క్వాడ్‌ బృందాలను నియమిస్తాం. పరీక్ష పేపర్‌ తెరిచే గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం.

సాక్షి: విద్యార్థులకు మీరిచ్చే సలహా ఏమిటి?

డీఈవో: పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు విద్యార్థులు ఇప్పటినుంచే సాధన చేయాలి. పరీక్షలకు మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు తమ పిల్లలు సెల్‌ఫోన్‌లు, టీవీలు చూడకుండా జాగ్రత్తపడాలి. ఇంట్లో ప్రతీరోజు చదివేలా చూడాలి. రోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలి. మాస్‌ కాపీయింగ్‌కు ఎలాంటి ఆస్కారం లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తాం. పదో తరగతి పరీక్షలనేది విద్యార్థి భవిష్యత్‌కు తొలిమెట్టు. ఇక్కడ మంచి మార్కులు సాధిస్తేనే భవిష్యత్‌ బంగారు బాటగా ఉంటుంది. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఒకరోజు ముందు పరీక్ష కేంద్రాలను సందర్శించాలి. మార్చి 1 నుంచి ప్రీఫైనల్‌ పరీక్షలు నిర్వహిస్తాం.

ప్రణీత, డీఈవో, ఆదిలాబాద్‌

#Tags