Best School: ఉత్తమ పాఠశాల @ మన్నూర్ జెడ్పీఎస్‌ఎస్.. ఏటా పదో తరగతి ఫలితాల్లో ఇలా..
జాబితాలో జిల్లా నుంచి ఇది ఒక్క టే ఉండడం గమనార్హం. ఈ పాఠశాలకు ఎనిమిది దశాబ్దాల చరిత్ర ఉంది. స్వాతంత్య్రం రాక ముందే అంటే 1937లోనే ఈ బడి ఏర్పాటైంది. నాటి నుంచి నేటి వరకు విద్యా సేవలందిస్తూ ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దింది.
విశాలమైన ఆటస్థలం, స రిపడా తరగతి గదులతో మూడు భాషల్లో విద్యాబో ధన కొనసాగుతోంది. ప్రస్తుతం ఇక్కడ తెలుగు, మరాఠీ, ఆంగ్ల మాధ్యమాలను నిర్వహిస్తున్నారు.
చదవండి: Department of Education: డుమ్మా టీచర్లపై నిఘా.. పాఠశాలల్లో విరి ఫొటోలు..
మొ త్తం 410 మంది విద్యార్థులున్నారు. కార్పొరేట్‌కు ధీటుగా విద్యను అందించడంతో పాటు ఏటా పదో తరగతి ఫలితాల్లో వంద శాతం ఫలితాలను సాధి స్తుండడం గమనార్హం. అంతేకాకుండా ఇక్కడి వి ద్యార్థులు వాలీబాల్ క్రీడలో సత్తా చాటుతూ రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎంపిక కావడం విశేషం.
వెరసి జోనల్‌స్థాయి ఉత్తమ పాఠశాలగా ఎంపిక కావడంతో ఎంఈవో ఉదయ్‌రావ్, హెచ్‌ఎం ఎస్.సంతోష్, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |