DEO Yadayah: ‘10th Class’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి..

మంచిర్యాల అర్బన్‌: పదో తరగతి పరీక్షల్లో ఉత్త మ ఫలితాలు సాధించాలని డీఈవో యాదయ్య అన్నారు. అక్టోబర్ 31న జిల్లా సైన్స్‌ కేంద్రంలో జిల్లా పరిషత్‌, ప్రభుత్వ పాఠశాలలు, ఆద ర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీల ప్రత్యేక అధికారులతో పదో తరగతి ఫలితాల కోసం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024–25 విద్యాసంవత్సరం ఉత్తమ ఫలితాల కోసం ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహించాల ని సూచించారు. విద్యార్థులందరూ తప్పనిసరి గా పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని, సందేహాలను నివృత్తి చేస్తూ పరీక్షలకు సంసిద్ధుల ను చేయాలని చెప్పారు.

చదవండి: Students Reading Books: విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెంపొందించాలి

ప్రత్యేక తరగతుల స మయసారిణి రూపొందించుకోవాలని, ప్రతీస బ్జెక్టుకు స్లిప్‌టెస్ట్‌లు నిర్వహించాలని తెలిపారు. ఏసీజీ దామోదర్‌, డీసీఈబీ కొండు భీంరావు, సమగ్రశిక్ష సమన్వయకర్తలు చౌదరి, సత్యనారాయణమూర్తి, శ్రీనివాస్‌, య శోద, జిల్లా సైన్స్‌ అధికారి మధుబాబు పాల్గొన్నారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2025 | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

#Tags