TS Gurukulam Jobs 2023 Online Exams : ఇక‌పై.. గురుకుల ఉద్యోగాల పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే.. కానీ..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : చాలా రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గురుకులాల ఉద్యోగాల భ‌ర్తీకి తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.
ts gurukulam jobs 2023

తొలిద‌ఫాలో వివిధ కేట‌గిరీల్లో మొత్తంగా 9231 పోస్లుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ ఉద్యోగాల ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు టీఆర్‌ఈఐఆర్‌బీ క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటుంది. ప్రస్తుత నోటిఫికేషన్లలో పరీక్షలను ఓఎంఆర్‌ ఆధారితంగా లేదా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ.. ఓఎంఆర్‌ ఆధారిత పరీక్షలకే ఏర్పాట్లు చేస్తూ వచ్చింది.

☛ తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఈ విధానంలోనే అయితే బెట‌రే.. కానీ..

కానీ టీఎస్‌పీఎస్సీలో పలు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఓఎంఆర్‌ ఆధారిత పరీక్షల విధానంపై తర్జనభర్జన పడుతోంది. మరోవైపు టీఎస్‌పీఎస్సీ అన్ని రకాల పరీక్షలను కంప్యూటర్‌ ఆధారిత (కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌–సీబీఆర్‌టీ) విధానంలోనే నిర్వహించేందుకు చర్యలు చేపట్టడంతో గురుకుల ఉద్యోగ అర్హత పరీక్షలను కూడా ఈ విధానంలోనే నిర్వహించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను టీఆర్‌ఈఐఆర్‌బీ పరిశీలిస్తోంది. 

ఈ విధానం అమలు సాధ్యం అయ్యేనా..

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష విధానం అమలుకు రాష్ట్రంలో పరిమిత సౌకర్యాలే ఉన్నాయి. ప్రైవేటు ఏజెన్సీల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో సెంటర్లున్నప్పటికీ ఒకే సమయంలో పరీక్ష నిర్వహిస్తే గరిష్టంగా 32 వేల మందే హాజరయ్యే వీలుంది. దీంతో గురుకుల పోస్టులకు లక్షల సంఖ్యలో అభ్యర్థులుండటంతో ఈ విధానం అమలు సాధ్యం కాదని టీఆర్‌ఈఐఆర్‌బీ తొలుత భావించింది.

☛ చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఒక్కో సబ్జెక్టు ఆధారంగా ఆన్‌లైన్‌లో పరీక్షలు.. 

కానీ ఒకే దఫా పరీక్షల నిర్వహణకు పోస్టులన్నీ ఒకే కేటగిరీకి సంబంధించినవి కాకపోవడంతో విడివిడిగా పరీక్షల నిర్వహణ అంశాన్ని బోర్డు పరిశీలిస్తోంది. టీజీటీ, పీజీటీ కేటగిరీలోనే 70% కొలువులున్నాయి. ఈ పోస్టుల్లో 15 సబ్జెక్టులున్నాయి. ఇవిగాకుండా జూనియర్‌ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్‌ కేటగిరీల్లోనూ సబ్జెక్టుల వారీగా పోస్టులున్నాయి. ఒక సబ్జెక్టు పరీక్ష రాసే అభ్యర్థి మరో సబ్జెక్టును ఎంపిక చేసుకొనే అవకాశాలు తక్కువ. దీంతో ఒక్కో సబ్జెక్టు ఆధారంగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించడం సాధ్యమేనని అధికారులు అంచనా వేస్తున్నారు.

☛ TS Gurukulam Jobs 2023 : ఈ టిప్స్ పాటిస్తే.. మీకు గురుకుల ఉద్యోగం త‌థ్యం..

ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ మే 28 : 

ప్రస్తుతం గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మే 28 వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. దీంతో దరఖాస్తు గడువు ముగిశాక అందే దరఖాస్తుల సంఖ్యపై స్పష్టత రానుంది. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంటుందని బోర్డు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

☛ ఇవి పాటిస్తే.. టీచ‌ర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips

ఈ ఒప్పందం తప్పనిసరి..
గురుకుల పరీక్షలను కంప్యూటర్‌ ఆధారిత పద్ధతిలో నిర్వహించాలంటే అందుకోసం ఆన్‌లైన్‌ టెస్టింగ్‌ ఏజెన్సీలతో ఒప్పందం తప్పనిసరి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని టెస్టింగ్‌ ఏజెన్సీలతో ఒప్పందం కోసం గురుకుల నియామకాల బోర్డు సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా కేంద్రాలు ఏయే తేదీల్లో ఖాళీగా ఉన్నాయనే వివరాలు సేకరిస్తోంది. ఖాళీగా ఉన్న తేదీల్లో పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై గురుకుల బోర్డు సమీక్షించనుంది.

9231 పోస్టులు కేట‌గిరి వారీగా ఇలా..

  పోస్టు పేరు పోస్టుల సంఖ్య
1. డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్‌ 868
2. జూనియ‌ర్ లెక్చరర్‌, లైబ్రేరియన్‌, ఫిజికల్ డైరెక్టర్ 2008
3. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ) 1276
4. ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (టీజీటీ) 4090
5. లైబ్రేరియ‌న్ స్కూల్ 434
6. ఫిజిక‌ల్ డైరెక్టర్స్‌ ఇన్ స్కూల్ 275
7. డ్రాయింగ్ టీచ‌ర్స్ ఆర్ట్ టీచ‌ర్స్ 134
8. క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్‌ క్రాఫ్ట్ టీచ‌ర్స్ 92
9. మ్యూజిక్ టీచ‌ర్స్ 124
  మొత్తం ఖాళీలు 9231

#Tags